Identity : త్రిష మలయాళం హిట్ సినిమా ఐడెంటిటీ.. ఇప్పుడు తెలుగులో రిలీజ్.. ఎప్పుడంటే..

ఇప్పుడు ఈ ఐడెంటిటీ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది.

Identity : త్రిష మలయాళం హిట్ సినిమా ఐడెంటిటీ.. ఇప్పుడు తెలుగులో రిలీజ్.. ఎప్పుడంటే..

Tovino Thomas Trisha Malayalam Movie Identity Releasing in Telugu

Updated On : January 18, 2025 / 8:33 PM IST

Identity  : త్రిష 96 సినిమా నుంచి సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పిస్తుంది. ప్రస్తుతం త్రిష చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయని సమాచారం. అందులో మన చిరంజీవి విశ్వంభర కూడా ఒకటి. అయితే ఇటీవల త్రిష మలయాళంలో ఐడెంటిటీ అనే సినిమా చేసింది.

Also Read : Pushpa 2 Re Loaded Version : అల్లు అర్జున్ పుష్ప 2 రీ లోడెడ్ వర్షన్.. ఏమేం సీన్స్ యాడ్ చేశారంటే..?

అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ రచన, దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్, త్రిష మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన ఐడెంటిటీ సినిమా మలయాళంలో జనవరి 2న రిలీజయి పెద్ద హిట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా మలయాళంలో 50 కోట్లకు పైగా వసూలు చేసింది. వినయ్ రాయ్, మందిర బేడి ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

Tovino Thomas Trisha Malayalam Movie Identity Releasing in Telugu

ఇప్పుడు ఈ ఐడెంటిటీ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్ పై చింతపల్లి రామారావు ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఐడెంటిటీ సినిమా ఈ నెల 24వ తేదిన తెలుగులో రిలీజ్ కానుంది.

Also Read : Prabhas – Vishnu : కన్నప్ప కోసం ప్రభాస్ ని ఎలా ఒప్పించాడు.. మా నాన్న ప్రభాస్ ఎంత క్లోజ్ అంటే.. విష్ణు కామెంట్స్