Pushpa 2 Re Loaded Version : అల్లు అర్జున్ పుష్ప 2 రీ లోడెడ్ వర్షన్.. ఏమేం సీన్స్ యాడ్ చేశారంటే..?

ఇంతకీ పుష్ప 2 సినిమాలో యాడ్ చేసిన సీన్స్ ఏవంటే..

Pushpa 2 Re Loaded Version : అల్లు అర్జున్ పుష్ప 2 రీ లోడెడ్ వర్షన్.. ఏమేం సీన్స్ యాడ్ చేశారంటే..?

Allu Arjun Pushpa 2 Reloaded Version Adding Scenes Details Here

Updated On : January 18, 2025 / 7:54 PM IST

Pushpa 2 Re Loaded Version : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా గత నెల డిసెంబర్ 5న పుష్ప 2 సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాకు సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 పాన్ ఇండియా రిలీజయి హిట్ అయింది. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమా పెద్ద హిట్ అయి కలెక్షన్స్ బాగా తీసుకొచ్చింది. ఇప్పటికే పుష్ప 2 సినిమా 1850 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాహుబలి 2 రికార్డ్ బద్దలు కొట్టింది.

ఇక అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా దంగల్ 2000 కోట్లతో నిలిచింది. ఈ సినిమా రికార్డ్ కూడా బద్దలు కొట్టేయాలని చూస్తుంది. మూవీ యూనిట్ ఇంకొన్ని సీన్స్ జత చేసి రీ లోడెడ్ వర్షన్ అంటూ నిన్న జనవరి 17న పుష్ప 2 మళ్ళీ రిలీజ్ చేశారు. దీంతో పలువురు అల్లు అర్జున్ ఫ్యాన్స్, నార్త్ ఆడియన్స్ పుష్ప 2లో యాడ్ చేసిన సీన్స్ కోసం మళ్ళీ సినిమాకు వెళ్తున్నారు.

Also Read : Prabhas – Vishnu : కన్నప్ప కోసం ప్రభాస్ ని ఎలా ఒప్పించాడు.. మా నాన్న ప్రభాస్ ఎంత క్లోజ్ అంటే.. విష్ణు కామెంట్స్

ఇంతకీ పుష్ప 2 సినిమాలో యాడ్ చేసిన సీన్స్ ఏవంటే..

#షెకావత్ ఫేక్ ఎర్రచందనం పట్టుకున్నట్టు చూపించారు. కానీ అది బయట వాళ్లకు నమ్మించడానికి ప్రభుత్వం నుంచి టెస్టింగ్ టీమ్ వచ్చి దాన్ని చెక్ చేసి అది నిజమైన ఎర్రచందనం అని ప్రకటించడం, దాన్ని షెకావత్ ఎలా మేనేజ్ చేసాడు అనే సీన్ ని జత చేశారు.
#రామేశ్వరం వెళ్లి షెకావత్, తమిళనాడు పోలీసులు ఎర్రచందనం కోసం వెతికే సీన్ లో ఆ వెతికే షాట్స్ ఇంకొన్ని జత చేశారు.
# అక్కడే రామేశ్వరంలో జాలి రెడ్డి అన్న బిచ్చారెడ్డి, పుష్ప మాల్దీవ్స్ లో బిజినెస్ మాట్లాడిన హమీద్ చనిపోవడం, వాళ్ళతో షెకావత్ మాట్లాడే సీన్స్ జత చేశారు.
#డబ్బు సమయానికి అందకపోవడం, సిద్దప్ప కంగారుపడి సీన్స్ జత చేశారు.
# ఎర్రచందనం షెకావత్ పట్టుకున్నాడు అని సిండికేట్ పుష్పని అనుమానించడం, జాతర ఫైట్ అయ్యాక పుష్పతో సిండికేట్ మీటింగ్ సీన్ జత చేశారు. ఈ సీన్ లో పుష్పకు ఎలివేషన్స్ బాగానే ఇచ్చారు.
#జపాన్ ఫైట్ ఫస్ట్ చూపించినప్పుడు ఆ ఫైట్ ఎందుకు పెట్టారు అని ఎవరికీ అర్ధం కాలేదు. ఇప్పుడు యాడ్ చేసిన సీన్స్ లో ఆ ఫైట్ ముగింపు ఇచ్చి, పుష్ప అసలు జపాన్ ఎందుకు వెళ్ళాడు, డబ్బులు ఎలా వచ్చాయి అనే సీన్స్ జత చేశారు.
#అసలు మొదట జాలిరెడ్డి సీన్స్ ఏమి లేవు, చివర్లో ఒక షాట్ లో కనిపిస్తాడు. కానీ యాడ్ చేసిన సీన్స్ లో జాలి రెడ్డిని పుష్ప కలవడం, జాలిరెడ్డికి ఆఫర్ ఇచ్చే సీన్ చూపించారు.
#కిస్సిక్ పాట ముందు సీఎం సిద్దప్ప పుష్ప ఫ్యామిలీతో ఫోటోలు దిగే చిన్న షాట్ యాడ్ చేశారు.
# ఫేక్ చందనం తగలపెట్టే ముందు షెకావత్ డ్యాన్స్ చేయడం యాడ్ చేశారు.
#సిటీ కేబుల్ లో పుష్ప మాట్లాడి వెళ్ళిపోయాక దివి మాట్లాడే షాట్ ఒకటి యాడ్ చేశారు.
# పార్ట్ 1లో చిన్నప్పుడు పుష్ప అన్నయ్య చైన్ లాగేసుకున్న సీన్ కి పుష్ప 2 లో క్లైమాక్స్ లో మళ్ళీ అదే చైన్ అన్నయ్య పుష్ప మేడలో వేసే సీన్ యాడ్ చేశారు.

Also Read : Child Artist Revanth : జనసేనకు చేసిన ప్రచారం చూసి.. ఈ బుడ్డోడికి సినిమాలో ఛాన్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి..

ఈ సీన్స్ జతచేసి కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానాలు ఇచ్చారు. కొన్ని సీన్స్ లో ఇంకొంచెం షార్ప్ ఎడిటింగ్ చేసి చిన్న చిన్న షాట్స్ తీసేసారు కూడా. ఈ సీన్స్ కోసం వెళ్ళాలి అనుకుంటే థియేటర్ కి వెళ్లి పుష్ప 2 మరోసారి చూసేయండి.