Bhatti Vikramarka : ఉగాది రోజే గద్దర్ అవార్డుల ప్రదానం.. ఇకపై ప్రతి ఉగాదికి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

తాజాగా గద్దర్ సినిమా అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పాల్గొన్నారు.

Bhatti Vikramarka : ఉగాది రోజే గద్దర్ అవార్డుల ప్రదానం.. ఇకపై ప్రతి ఉగాదికి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

Updated On : January 18, 2025 / 8:51 PM IST

Bhatti Vikramarka : గతంలో సినీ పరిశ్రమకు ప్రభుత్వం తరపున నంది అవార్డులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక గత ప్రభుత్వాలు నంది అవార్డులను పక్కన పెట్టాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని గతంలోనే ప్రకటించి ఇండస్ట్రీ పెద్దలతో ఈ అవార్డుల కమిటీ కూడా వేశారు.

Also Read : Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర డ్రోన్ కలకలం.. అసలేం జరుగుతోంది? ఇది ఎవరి పని?

తాజాగా గద్దర్ సినిమా అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పాల్గొన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉగాది రోజు గద్దర్ అవార్డుల ప్రదానం చేస్తాం. సినిమా నిర్మాణంలో హైదరాబాద్ ని ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తాం. ఈ ఏడాది నుంచి ప్రతి ఉగాదికి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందించాలని నిర్ణయించాం. గద్దర్ అవార్డ్ కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు చేయాలి. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ గద్దర్ అవార్డులు ఇస్తాము. జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక, విద్యా, సామాజిక ఔచిత్యం ప్రోత్సహించాలని అవార్డ్ లు ఇవ్వనున్నాం. మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలన్నదే సర్కార్ లక్ష్యం. గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయస్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలి. తెలంగాణ కల్చరల్ ఐకాన్ గద్దర్ ప్రతిష్ఠ పెంచేలా అవార్డుల లోగోలు ఉండాలి. గత పది ఏళ్లలో చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పనిచేస్తుంది. ఫీచర్ ఫిల్మ్‌లు, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు వంటి వివిధ విభాగాలలో అవార్డులు, అవార్డులతో పాటు నగదు పురస్కారం, ప్రశంసా పత్రం కూడా అందిస్తాం అని తెలిపారు.

Also Read : Pushpa 2 Re Loaded Version : అల్లు అర్జున్ పుష్ప 2 రీ లోడెడ్ వర్షన్.. ఏమేం సీన్స్ యాడ్ చేశారంటే..?