Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర డ్రోన్ కలకలం.. అసలేం జరుగుతోంది? ఇది ఎవరి పని?

కొన్ని రోజుల క్రితం జనసేనాని క్యాంపు కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించడం తీవ్ర కలకలం రేపింది.

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర డ్రోన్ కలకలం.. అసలేం జరుగుతోంది? ఇది ఎవరి పని?

Updated On : January 18, 2025 / 8:25 PM IST

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర డ్రోన్ సంచారం కలకలం రేపింది. క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. మధ్యాహ్నం సమయంలో డ్రోన్ ఎగిరినట్లు గుర్తించారు. అప్రమత్తమైన క్యాంప్ ఆఫీస్ సిబ్బంది.. భద్రతా కారణాల దృష్ట్యా డీజీపీ కార్యాలయానికి సమాచారం అందించారు. గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.

డ్రోన్ ఎగరడంపై అనేక అనుమానాలు..
మంగళగిరిలోని జనసేనాని పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ పైన, పార్టీ కార్యాలయంగా నిర్మాణంలో ఉన్న భవనంపైన కూడా ఒక గుర్తు తెలియని డ్రోన్ ఎగిరినట్లు కార్యాలయ సిబ్బంది గుర్తించారు. మధ్యాహ్నం 1.30 గంట నుంచి 1.50 నిమిషాల మధ్య ఈ డ్రోన్ పలుమార్లు ఎగిరినట్లుగా కార్యాలయ సిబ్బంది గుర్తించారు. ఆ వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యారు. దీని గురించి పవన్ కల్యాణ్ కు సమాచారం ఇచ్చారు. అలాగే డీజీపీకి, గుంటూరు కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశారు. దాంతో పాటు గుంటూరు ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు.

Also Read : విజయవాడకు అమిత్‌ షా.. చంద్రబాబు నివాసంలో ఆయనకు విందు

డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి నివాసం ఉంటున్న క్యాంపు కార్యాలయం, అలాగే పార్టీ కార్యాలయానికి సంబంధించి అనుమతి లేకుండా గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేయడం అన్నది భద్రతా కారణాల దృష్ట్యా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి, వెంటనే డీజీపీకి ఫిర్యాదు చేశారు.

ఆ డ్రోన్ ఎవరు ఎగురవేశారు? ఎందుకు ఎగురవేశారు?
దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ డ్రోన్ ఎవరు ఎగురవేశారు? ఎందుకు ఎగురవేశారు? పొరపాటున వచ్చిందా? లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

మొన్న బెదిరింపు కాల్, నిన్న నకిలీ పోలీస్, ఇప్పుడు డ్రోన్.. అసలేం జరుగుతోంది?
కొన్ని రోజుల క్రితం జనసేనాని క్యాంపు కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించడం తీవ్ర కలకలం రేపింది. అటు పవన్ కల్యాణ్ విజయనగరం పర్యటనలో నకిలీ పోలీస్ అధికారి హల్ చల్ చేయడం జరిగింది. ఈ ఘటనల నేపథ్యంలో దీనిపై పోలీసులు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు. డ్రోన్ ఎగురవేసిన వారి వివరాలు వీలైనంత తొందరగా తెలుసుకుని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

Also Read : తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్