విజయవాడకు అమిత్ షా.. చంద్రబాబు నివాసంలో ఆయనకు విందు
విందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, పురందేశ్వరి పలువురు సీనియర్ నేతలు హాజరవుతున్నారు.

Amit Shah
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ రాత్రికి విజయవాడ చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు. గన్నవరం విమానాశ్రయంలో అమిత్ షాకు కూటమి నేతలు ఘనస్వాగతం పలకనున్నారు.
అమిత్ షాకు స్వాగతం పలికేందుకు మూడు పార్టీల నుంచి 13 మంది నేతలకు అధికారులు అనుమతి ఇచ్చారు. టీడీపీ నుంచి అమిత్ షాకు మంత్రి నారా లోకేశ్, హోం మంత్రి వంగలపూడి అనిత, చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, గద్దె రామ్మోహన్, తదితర నేతలు స్వాగతం పలుకుతారు.
అమిత్ షాకు స్వాగతం పలికేందుకు మూడు పార్టీల నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి 11,400 కోట్ల రూపాయలు ప్రకటించిన మరుసటి రోజే అమిత్ షా అమరావతికి వస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది.
గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అమిత్ షా రానున్నారు. ఈ రాత్రికి చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నివాసంలో జరగనున్న విందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, పురందేశ్వరి పలువురు సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి ఉండవల్లి దాకా దారి పొడవున స్వాగత ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు నివాసంలో విందు భేటీ ముగిసిన తర్వాత తిరిగి విజయవాడలోని ప్రైవేట్ హోటల్లో ఈ రాత్రికి బస చేయనున్నారు అమిత్ షా. జనవరి 19న ఏపీలో జరిగే ఎన్డీఆర్‌ఎఫ్ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అమిత్ షా హాజరుకానున్నారు.
Formula E Car Race Case : ఫార్ములా ఈ కార్ కేసు.. ఏసీబీ విచారణకు ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు..