Formula E Car Race Case : ఫార్ములా ఈ కార్ కేసు.. ఏసీబీ విచారణకు ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు..

సీజన్ 10తో పాటు 4 సీజన్లకు ఒప్పందం చేసుకున్నప్పటికీ.. ఎందుకు వెనక్కి వెళ్లిందో ప్రశ్నింబోతోంది.

Formula E Car Race Case : ఫార్ములా ఈ కార్ కేసు.. ఏసీబీ విచారణకు ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు..

Formula E Race Case

Updated On : January 18, 2025 / 5:41 PM IST

Formula E Car Race Case : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులను విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించారు.

రేసుల నిర్వహణ బాధ్యత నుంచి ఎందుకు తప్పుకున్నారు?
2022 అక్టోబర్ 25న జరిగిన తొలి ఒప్పందంపై ప్రశ్నించబోతున్న ఏసీబీ.. సీజన్ 9 తర్వాత రేసుల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడంపై ఆరా తియ్యబోతున్నారు. సీజన్ 9 కోసం ఒక దఫా 30 కోట్లు మాత్రమే చెల్లించిన గ్రీన్ కో.. మిగతా రెండు విడతల డబ్బులు ఎందుకు చెల్లించలేదో ప్రశ్నించబోతోంది. సీజన్ 10తో పాటు 4 సీజన్లకు ఒప్పందం చేసుకున్నప్పటికీ.. ఎందుకు వెనక్కి వెళ్లిందో ప్రశ్నింబోతోంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ తేదీలపైనా ఏసీబీ ఫోకస్ చేసింది.

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఇప్పటికే దర్యాఫును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఏ1, ఏ2, ఏ3 లను కూడా ఒక దఫా విచారణ పూర్తి చేసింది. ఇక రేస్ కు సంబంధించి కీలకంగా వ్యవహరించిన గ్రీన్ కో కి కో పార్టనర్ గా ఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ ప్రతినిధులు విచారణకు రావాలంటూ గతంలో ఏసీబీ నోటీసులు ఇచ్చింది.

Also Read : టెన్షన్.. టెన్షన్.. నల్గొండ జిల్లాలో పెన్నా సిమెంట్‌ ఫ్యాక్టరీ గనుల విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ

9వ సీజన్ తర్వాత వైదొలగడానికి కారణం ఏంటి?
ఈ ఉదయం 10 ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ ప్రతినిధులు ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఉదయం విచారణకు రాలేమని, మధ్యాహ్నం తర్వాత విచారణకు వస్తామని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వారు ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. కార్ రేసింగ్ కు సంబంధించి మొత్తం 4 సీజన్లు ఉంటే.. 9వ సీజన్ తర్వాత వైదొలగడానికి కారణం ఏంటి అనేదానిపై తమ విచారణలో వివరాలు సేకరించబోతోంది ఏసీబీ.

అర్ధాంతరంగా కార్ రేస్ నుంచి ఎందుకు వైదొలగాల్సి వచ్చింది?
దీనికి సంబంధించి గ్రీన్ కో తో పాటు కో పార్టనర్ గా ఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ తో పాటు మరికొన్ని సంస్థలు ఉన్నాయి కాబట్టి మీరు అర్ధాంతరంగా కార్ రేస్ నుంచి ఎందుకు వైదొలగాల్సి వచ్చింది? అగ్రిమెంట్ పత్రాలు కూడా తీసుకుని విచారణకు రావాలని.. ఏసీబీ అధికారులు వారికి సర్వ్ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. నాలుగు సీజన్లకు కొనసాగాల్సి ఉంటే.. ఎందుకు ఒక సీజన్ తో వైదొలగాల్సి వచ్చింది, అసలేం జరిగింది? అన్న కోణంలో ఏసీబీ అధికారులు సంస్థ ప్రతినిధులను ప్రశ్నింబోతున్నారు.

గ్రీన్ కో అనేది మెయిన్ పార్టనర్. ఏస్ నెక్ట్ జెన్ తో పాటు మరికొన్ని సంస్థలు కో పార్టనర్స్ గా ఉన్నాయి. సీజన్ 9 కు సంబంధించి రేసింగ్ లో ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో వారి వద్ద నుంచి వివరాలు సేకరించేందుకు ఏసీబీ అధికారులు వారిని విచారణకు పిలిపించారు.

Also Read : స్థానికులు ఆవేదన వ్యక్తం చేయడంతో కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ ఆగ్రహం