Ravikishan sensational comments on Casting Couch
Ravikishan : మీటూ కామెంట్స్, కాస్టింగ్ కౌచ్(Casting Couch) కామెంట్స్ సినీ పరిశ్రమలో, ముఖ్యంగా బాలీవుడ్(Bollywood) లో ఎక్కువగా వినిపిస్తాయి. అయితే అమ్మాయిలే ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ చేస్తారు. ఒక్కోసారి అబ్బాయిలకు ఎదురయినా కొంతమంది చెప్పుకోలేరు. తాజాగా ప్రముఖ నటుడు, ఎంపీ రవికిషన్(Ravikishan) కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రవికిషన్ ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరో పక్క రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు. రేసుగుర్రం(Resugurram) సినిమాతో తెలుగులో కూడా బాగా ఫేమ్ తెచ్చుకొని పలు భాషల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీబిజీగా ఉన్నారు.
Felicitation to Chandrabose : రవీంద్రభారతిలో ఆస్కార్ విజేత చంద్రబోస్‌కు సత్కారం గ్యాలరీ..
తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవికిషన్ మాట్లాడుతూ.. నన్ను కూడా కాస్టింగ్ కౌచ్ చేశారు. ఒక ఆవిడ నాకు రాత్రికి కాఫీ ఆఫర్ చేసి రమ్మంది. ఆమె అప్పుడు మాట్లాడిన మాటలు, చెప్పే విధానం నాకు అర్థమైంది. ఇప్పుడు ఆమె చాలా పెద్ద బిగ్ షాట్ అయింది. ఆమె పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు అని అన్నారు. దీంతో రవికిషన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి రవికిషన్ ని కాస్టింగ్ కౌచ్ చేసిన ఆ అమ్మాయి ఎవరో.