Ravikrishna
Ravikrishna : సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న రవికృష్ణ బిగ్ బాస్ తో మరింత వైరల్ అయి ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే హీరోగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల దండోరా సినిమాలో రవికృష్ణ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో రవికృష్ణ వేరే కులం అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళు ఇతన్ని చంపేసే పాత్రలో నటించాడు.(Ravikrishna)
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవికృష్ణ కులం సమస్య గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
Also Read : Nandu : ఆ మాటలు నన్ను బాధపెట్టాయి.. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.. ఆరోపణలపై స్పందించిన నందు..
రవికృష్ణ మాట్లాడుతూ.. స్కూల్ లో, కాలేజీలో కూడా కులం గురించి మాట్లాడేవాళ్ళు. మీరేంటి అని అడిగేవాళ్ళు ఎక్కడికి వెళ్లినా. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా కులం సమస్యల గురించి ఫేస్ చేశాను. కానీ దాని గురించి మాట్లాడలేదు. వేరే వాళ్ళు కూడా ఇండస్ట్రీలో కులం రిలేటెడ్ సమస్యల గురించి మాట్లాడటానికి భయపడతారు, ఇంట్రెస్ట్ చూపించరు. నేను ఇండస్ట్రీలో స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు నా వాయిస్ రైజ్ చేసి మాట్లాడతాను దాని గురించి. ఇండస్ట్రీలో కూడా మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను.
ఓ సారి అన్ని ఓకే అయ్యి అగ్రిమెంట్ చేసుకుంటప్పుడు మీ డీటెయిల్స్ ఇవ్వమంటే ఆధార్, పాన్ కార్డు పంపిస్తే దాంట్లో నా సర్ నేమ్ చూసి మీరు ఇదా అని మళ్ళీ చెప్తాము అని అన్నారు. అగ్రిమెంట్ అన్నారు కదా అని అడిగితే మాట్లాడి మళ్ళీ చెప్తాము అన్నారు. అలా ఒక మూడు నాలుగు సినిమాలు నా కులం చూసి ఆగిపోయాయి. సరే ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా ఓకే అన్నా కూడా కుదరదు అని ఏవో కారణాలు చెప్పి తప్పించారు. కులం సమస్యలు గట్టిగానే అనుభవించాను అని అన్నారు. దీంతో రవికృష్ణ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా అతని కులం ఏంటి అని వెతుకుతున్నారు నెటిజన్లు.
Also Read : Jagapathi Babu : ఓర్నీ.. ఇతను జగపతి బాబా? రామ్ చరణ్ కోసం ఇలా మారిపోయాడేంటి..?