Nandu : ఆ మాటలు నన్ను బాధపెట్టాయి.. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.. ఆరోపణలపై స్పందించిన నందు..
తాజాగా సైక్ సిద్దార్థ్ సినిమా ప్రెస్ మీట్ లో నందు ఈ ఆరోపణలపై స్పందించాడు. (Nandu)
Nandu
Nandu : నటుడు నందు ఓ పక్క హీరోగా చేస్తూనే మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ వారం క్రిస్మస్ కి రిలీజయిన దండోరా సినిమాలో నందు కీలక పాత్రలో నటించాడు. నందు హీరోగా, నిర్మాతగా చేసిన సైక్ సిద్దార్థ్ సినిమా జనవరి 1న రిలీజ్ కానుంది. అలాగే ఈ వనవీర సినిమాలో నందు విలన్ గా నటించాడు. అయితే ఇటీవల నిర్వహించిన వనవీర సినిమా ప్రెస్ మెట్ కి నందు రాలేదు.(Nandu)
దీంతో వనవీర దర్శకుడు, హీరో అవినాష్.. నందు పేరు చెప్పకుండా ఇండైరెక్ట్ గా అతనికి కమిట్మెంట్ లేదు, తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలి కదా అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. తాజాగా సైక్ సిద్దార్థ్ సినిమా ప్రెస్ మీట్ లో నందు ఈ ఆరోపణలపై స్పందించాడు.
Also Raed : Jagapathi Babu : ఓర్నీ.. ఇతను జగపతి బాబా? రామ్ చరణ్ కోసం ఇలా మారిపోయాడేంటి..?
Nandu
నందు మాట్లాడుతూ.. జనవరి 1న నేను హీరోగా చేస్తున్న సైకో సిద్దార్థ, విలన్ గా చేస్తున్న వనవీర రిలీజ్ అవుతున్నాయి. దండోరా లాస్ట్ వీక్ వచ్చింది. అందులో కీలక పాత్ర చేశాను. అది హిట్ అయింది. ఈ వారం ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయితే అంతకన్నా అదృష్టం ఇంకోటి ఉండదు. నేను సపోర్ట్ చేయలేదని ప్రెస్ మీట్ లో మాట్లాడారు. నేను దర్శకుడికి, నిర్మాతకు రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళు నా పేరు చెప్పకుండానే కామెంట్స్ చేసారు. కానీ అందరికి అర్థమైంది.
ఇన్ని రోజులు నా పోస్టర్స్ వేయలేదు. నిన్న ట్రైలర్ లాంచ్ లో వేశారు. ఓ పక్క నా సినిమా కూడా వాయిదా పడింది. ఆయన హీరోయిన్ ని పెట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రమోషన్స్ కి అన్నారు. నేను కూడా మా హీరోయిన్ ని పట్టుకొని ఊర్లు తిరుగుతున్నా ప్రమోషన్స్ కి . నాకు జ్వరం ఉంది, ట్యాబ్లేట్స్ వేసుకొని ప్రెస్ మెట్ కి వచ్చా. నాకు బాధలేదు వాళ్ళు అలా మాట్లాడినందుకు. కానీ రేపు ఉదయం ట్రైలర్ లాంచ్ అంటే ఇవాళ సాయంత్రం 4 గంటలకు మెసేజ్ పెట్టారు రమ్మని. నేను గుంటూరులో ఉన్నా ఈ సినిమా ప్రమోషన్స్ లో. ఆ ప్రమోషన్స్ అన్ని వారం రోజులు ఫిక్స్ అయి ఉన్నాయి. నేను నిర్మాతకు ఫోన్ చేసి వేరే చోట ఉన్నాను కుదరదు అని కూడా చెప్పాను. ఆయన అవునా అని వదిలేసాడు. కనీసం మీరెప్పుడు ఫ్రీగా ఉంటారు అప్పుడు పెట్టుకుందాం అంటే వచ్చేవాడిని. నేను సపోర్ట్ చేస్తా.
Also Read : The RajaSaab : ‘రాజాసాబ్’ ట్రైలర్ 2.0 వచ్చేసింది.. ప్రభాస్ సరికొత్తగా అదరగొట్టాడుగా..
Nandu
ప్రెస్ మీట్ చూసి బాధపడ్డాను. ఫోన్ చేసి నిర్మాతతో మాట్లాడాను. నాకు ఎలాంటి కోపం లేదు. అవినాష్ గారికి కూడా ఫోన్ చేశాను ఆయన లిఫ్ట్ చేయలేదు. సైక్ సిద్దార్థ్ – వనవీర కలిసి ఒక కాన్సెప్ట్ ప్రమోషన్ చేద్దామని కూడా అనుకున్నాను. నేను అబద్దం చెప్పట్లేదు. నా మీద కమిట్మెంట్ లేదని టక్కున ఒక మాట అనేసారు. ఆ మాట నాకు చాలా బాధేసింది. వనవీర సినిమా ఒక రోజు రాత్రి 9 గంటలకు వరకు షూట్ అని చెప్పారు. అది దాటి తెల్లారి 2 అయింది. అయినా పూర్తవలేదు. ఆ నెక్స్ట్ డే నాకు ఉదయం సన్ రైజ్ షూట్ ఉంది. వాళ్ళు ఇచ్చిన టైం కంటే కూడా ఎక్కువే వర్క్ చేశా. అది నా కమిట్మెంట్. ఆ రోజు షూట్ అవ్వకపోతే నెక్స్ట్ డే చేశా. దానికి డబ్బులు కూడా తీసుకోలేదు.
ఒకేసారి నాలుగైదు సినిమాలు ఉంటే నేనేం చేయగలను. నా వల్ల అయింది చేస్తూనే ఉన్నాను. వాళ్ళు కమిట్మెంట్, అగ్రిమెంట్ అన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. అగ్రిమెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను చేస్తే మంచితనంతో చేయడమే. ఆ సినిమాకు రెండు ఈవెంట్స్ లు పెట్టారు. ఆ రెండిటికి ముందు రోజే చెప్పారు నాకు ప్రెస్ మీట్ ఉందని. కనీసం వారం రోజులు ముందు చెప్పాలి అని అగ్రిమెంట్ లో కూడా ఉంటుంది. నేను కమిట్మెంట్ ఇవ్వలేదు అనే మాట నాకు బాధ ఎక్కువగా ఉంది. కమిట్మెంట్ విషయంలో నేను ఫెయిల్ అవ్వలేదు. యాక్టర్ గా కమిట్మెంట్ ఇచ్చాను. టైం అడ్జస్ట్ చేసి చెప్పండి వచ్చేవాడిని అని అన్నారు. మరి నందు వ్యాఖ్యలపై వనవీర టీమ్ స్పందిస్తుందా చూడాలి.
Also Read : Lenin: ‘లెనిన్’ మూవీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. అవుట్ ఫుట్ అదుర్స్ అంట..
