Jagapathi Babu : ఓర్నీ.. ఇతను జగపతి బాబా? రామ్ చరణ్ కోసం ఇలా మారిపోయాడేంటి..?
తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.(Jagapathi Babu)
Jagapathi Babu New Look Released from Ram Charan Peddi Movie
Jagapathi Babu : రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివన్న, బాలీవుడ్ స్టార్ దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2026 మార్చ్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.(Jagapathi Babu)
జగపతి బాబు ఈ సినిమాలో అప్పల సూరి అనే పాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించి ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ లుక్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇది జగపతి బాబేనా అని సందేహిస్తున్నారు. ఏ వైపు నుంచి చూసినా ఈ ఫస్ట్ లుక్ అసలు జగపతి బాబులా అనిపించట్లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో పాత్ర కోసం జగపతి బాబు ఇంతలా మారిపోయాడా అని ఆశ్చర్యపోతున్నారు.
Also Read : The RajaSaab : ‘రాజాసాబ్’ ట్రైలర్ 2.0 వచ్చేసింది.. ప్రభాస్ సరికొత్తగా అదరగొట్టాడుగా..
రామ్ చరణ్ పెద్ది సినిమా కోసమే జగపతి బాబు ఈ సరికొత్త లుక్ లోకి మారారు. మరి సినిమాలో జగపతి బాబు పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ఆల్రెడీ జగపతి బాబు – రామ్ చరణ్ కలిసి రంగస్థలంలో నటించి అదరగొట్టారు. మరోసారి ఈ ఇద్దరి కాంబో పెద్ది సినిమాలో సరికొత్తగా మెప్పించబోతుందని తెలుస్తుంది.

Also Read : Lenin: ‘లెనిన్’ మూవీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. అవుట్ ఫుట్ అదుర్స్ అంట..
