Eagle Movie : మారింది తేదీ మాత్రమే మాసోడి మార్క్ కాదు.. సంక్రాంతి నుంచి ఈగల్ తప్పుకోవడంపై స్పందించిన రవితేజ..

రవితేజ ఈగల్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. దీనిపై మొదటిసారి రవితేజ(Raviteja), చిత్రయూనిట్ స్పందించారు.

Raviteaj Reaction on Eagle Movie out from Sankranthi 2024 Race

Eagle Movie : సంక్రాంతి సినిమాల మధ్య ఎప్పుడూ క్లాష్ ఉంటుంది. అది ఈ సారి సంక్రాంతికి ఇంకొంచెం ఎక్కువైంది. అయిదు సినిమాలు ప్రకటించడంతో థియేటర్స్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో టాలీవుడ్ నిర్మాతలు కూర్చొని అందరితో మాట్లాడి ఒక సినిమాని తప్పించారు. ముందు సంక్రాంతి బరిలో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్‌, ఈగల్, నా సామిరంగ సినిమాలు తెలుగు నుంచి ఉన్నాయి. వీటిల్లో ఇప్పుడు రవితేజ ఈగల్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది.

దీనిపై మొదటిసారి రవితేజ(Raviteja), చిత్రయూనిట్ స్పందించారు. ఈగల్ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అందులో.. మొండోడి మనసు పుట్ట తేనే. తన నిర్మాత, పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుండి ఫిబ్రవరికి తీసుకొచ్చాడు. అందరూ చూడాల్సిన జనరంజక చిత్రం ప్రదర్శించడానికి అంతే మొత్తంలో థియేటర్లు కావాల్సి ఉంటుంది, దర్శకుడు మొదలుకుని సృజనాత్మక సిబ్బంది పనిని ప్రేక్షకులు చూసి మెచ్చుకోడానికి ఒక ఇరుకులేని వేదిక, సమయం కావాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బరిలో రద్దీని తగ్గించే నిర్ణయం తీసుకున్నారు. మారింది తేది మాత్రమే మాసోడి మార్క్ కాదు అని పోస్ట్ చేశారు.

Also Read : Prashanth Varma : ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘మహాభారతం’.. ఏ హీరోకి ఏ క్యారెక్టర్ అనుకుంటున్నాడో తెలుసా?

ఇక ఈగల్ కొత్త రిలీజ్ డేట్ ఫిబ్రవరి 9 గా ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ని రవితేజ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మన తెలుగు సినిమా బాగుండాలని ఒక స్టెప్ వెనక్కి వేస్తున్నాను. రావడం లేట్ అవ్వొచ్చు కానీ గురి తప్పడం కాదు. ఈగల్ ఫిబ్రవరి 9న రిలీజ్ అవ్వబోతుంది. మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు. దీంతో వేరే సినిమాల కోసం, తెలుగు సినీ పరిశ్రమ బాగుండాలని రవితేజ తగ్గినందుకు అభిమానులతో పాటు, ప్రేక్షకులు రవితేజని అభినందిస్తున్నారు.