Raviteja : రవితేజ మైల్ స్టోన్ సినిమా.. ఈసారి పక్కా హిట్..

రవితేజ తన 75వ సినిమాకి బాగానే కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Raviteja : రవితేజ మైల్ స్టోన్ సినిమా.. ఈసారి పక్కా హిట్..

Raviteja 75th Movie Mass Jathara Fans Expecting Hit

Updated On : January 25, 2025 / 8:58 PM IST

Raviteja : రవితేజ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ చేస్తున్నారు. అసలే బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న రవితేజ తన 75వ సినిమాకి బాగానే కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. టైమ్ తీస్కోవడంతో పాటు పక్కాగా హిట్ ఎలిమెంట్స్ తోనే సినిమాని ప్యాక్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. రవితేజ తన అప్ కమింగ్ మూవీ మీదే అన్ని ఆశలుపెట్టుకున్నారు. తన 75వ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో మెమరబుల్ మూవీగా మార్చుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పోస్టర్ తో రవితేజ ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. అన్నిటికీ మించి తన కెరీర్ లో రీసెంట్ గా మంచి హిట్ ఇచ్చిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మరోసారి తన క్రేజీ యాక్టింగ్ స్కిల్స్ చూపించబోతున్నారు. రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మాస్ జాతర’ మీద ఫోకస్ చేస్తున్నారు అంతా. ధమాకా తర్వాత రెండేళ్ల నుంచి అసలు హిట్ పడలేదు రవితేజ కి. డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేసినా కానీ ఏ మాత్రం ఆడియన్స్ రిసీవ్ చేస్కోలేదు. అయితే ఈసారి మాత్రం హిట్ అయ్యి తీరాల్సిందే అంటున్నారు రవితేజ.

Also Read : Vishwambhara : ఇండస్ట్రీ హిట్ కొట్టిన మెగాస్టార్ సినిమా రిలీజ్ రోజే.. ‘విశ్వంభర’ రిలీజ్ కూడా?

ఎందుకంటే మాస్ జాతరలో కూడా ఈ సారి కెరీర్ హిట్ అయిన పోలీస్ క్యారెక్టరే చేస్తున్నారు. కోవిడ్ కి ముందు వరకూ సరైన హిట్ లేని రవితేజ కి క్రాక్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. క్రాక్ లో కూడా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో ఎంటర్టైన్ చేశారు రవితేజ. అంతేకాదు తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన విక్రమార్కుడులో కూడా రవితేజ పోలీస్ రోల్ లోనే అదరగొట్టారు. అందుకే ఈ సారి కూడా రవితేజ పోలీస్ గా ఎంటర్టైన్ చేస్తారంటూ టాక్ స్టార్టయ్యింది.

మాస్ జాతర లో అన్నీ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయంటున్నారు ఫాన్స్. ఎందుకంటే మాస్ జాతరలో రవితేజ పోలీస్ రోల్ చేస్తున్నారు, హీరోయిన్ గా ధమాకాతో రవితేజ కి హిట్ ఇచ్చిన శ్రీలీల ఉంది, కలిసొచ్చిన భీమ్స్ మ్యూజిక్ ఉంది, వరుస హిట్స్ ఇస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ ఉంది. వీటికి తోడు ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తో స్టోరీ ఉంది. అన్నిటికీ మించి అదరగొట్టే రవితేజ యాక్షన్ ఉంది. మరి ఇన్ని ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాస్ జాతర గ్యారంటీగా హిట్టవుతుందని నమ్మకంతో ఉన్నారు రవితేజ అభిమానులు. మరో వైపు రవితేజ కూడా కెరీర్ మైల్ స్టోన్ మూవీ మెమరబుల్ గా ఉండాలని ఈ సారి టైమ్ తీసుకుని, కేర్ తీసుకుని అన్నిరకాలుగా వర్కవుట్ అయ్యే స్టోరీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మరి మేలో రిలీజవుతున్న ఈ సినిమాతో రవితేజ బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో చూడాలి.

Also Read : Anil Ravipudi – Nani : వాట్.. ఆ సూపర్ హిట్ సినిమా క్లైమాక్స్ రాసింది అనిల్ రావిపూడినా? నాని, అనిల్ కలిసి ఏం చేశారంటే..

అయితే ఈ సినిమా గ్లింప్స్ మాత్రం రేపు జనవరి 26 రవితేజ పుట్టిన రోజున రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ రవితేజ గ్లింప్స్ కోసం ఎదురుచూస్తున్నారు.