Anil Ravipudi – Nani : వాట్.. ఆ సూపర్ హిట్ సినిమా క్లైమాక్స్ రాసింది అనిల్ రావిపూడినా? నాని, అనిల్ కలిసి ఏం చేశారంటే..
నాని సూపర్ హిట్ సినిమాకు క్లైమాక్స్ అనిల్ రావిపూడి రాశారంట. ఏ సినిమానో, ఏం రాసారో తెలుసా..

Anil Ravipudi Says he Worked for Nani Super Hit Film
Anil Ravipudi – Nani : అనిల్ రావిపూడి.. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న డైరెక్టర్స్ లో ఒకరు. రైటర్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం డైరెక్టర్ గా మారి వరుసగా పటాస్ నుంచి ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం వరకు మొత్తం 8 సినిమాలు తీసి 8 హిట్స్ కొట్టాడు. ఇటీవల పండక్కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టగా ఆ సినిమా ఇప్పటికే 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అలా మొదలైంది సినిమా క్లైమాక్స్ మీరు రాశారా అని అడగ్గా అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.
అనిల్ రావిపూడి రైటర్ గా ఉన్న సమయంలో నాని అలా మొదలైంది సినిమాకి పని చేసానని తెలిపాడు. నాని కెరీర్ లో ఫస్ట్ కమర్షియల్ హిట్ సినిమా అలా మొదలైంది. నందిని రెడ్డికి డైరెక్టర్ గా మొదటి సినిమా అది. నిత్యా మీనన్ కి తెలుగులో మొదటి సినిమా. ఇలా ఆల్మోస్ట్ కొత్త వాళ్ళతో నిర్మాత దామోదర ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. అయితే ఈ సినిమా షూట్ అయ్యాక ఎడిటింగ్ లో సినిమా చూసిన వాళ్ళు ఏవేవో తప్పులు చెపుతున్నారట. దీంతో ఆ సినిమా ఆగిపోయిన సమయంలో అనిల్ రావిపూడి వెళ్లారట.
అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. అలా మొదలైంది సినిమా షూట్ అయిపోయి ఎడిటింగ్ లో ఆగిపోయింది సినిమా. సినిమా చూసిన వాళ్లంతా ఏవేవో ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. అప్పటికే నందిని ఫ్రస్టేషన్ లో ఉంది. నేను కూడా సినిమా చూడటానికి వెళ్ళాను. ఆ సినిమా చూసి నేను ఫుల్ గా ఎంజాయ్ చేశాను. పడీ పడీ నవ్వాను. అప్పటి వరకు ఎవ్వరూ ఆ సినిమాని అలా ఎంజాయ్ చేయలేదట. సీన్స్ అన్ని బాగున్నాయి. నాని – నిత్యా మీనన్ కాంబో ఫ్రెష్ గా ఉంది. చాలా కొత్తగా ఉంది సినిమా అని చెప్పాను. నందిని షాక్ అయింది. అప్పటి వరకు సినిమా చూసిన వాళ్ళు ఏం చెప్పారో కానీ నన్ను నిజంగానే బాగుందా అని అడిగితే ఇంత మంచి కామెడీ సినిమా తీసావ్ అని చెప్పాను. ఇదే మాట నిర్మాతకు చెప్తావా అంటే ఎవరికైనా చెప్తా అన్నాను. నిర్మాత దాము గారికి కూడా బాగుంది అని చెప్పి సినిమాలో ఉన్న పాజిటివ్స్ అన్ని చెప్పాను.
అప్పుడు దాము గారు వేరే వాళ్ళు ఆ సినిమా గురించి రాసిన నెగిటివ్స్, డౌట్స్ అన్ని తీసి ఇచ్చారు. వాటిల్లో కొన్నిటికి సమాధానం చెప్పాను. చివరగా ఒక ప్రాబ్లమ్ అయితే ఉంది అనిపించింది. స్క్రీన్ ప్లే కాస్త మారిస్తే బెటర్, క్లైమాక్స్ కాస్త మారిస్తే బెటర్ అనిపించింది. అదే వాళ్లకు చెప్పాను. అప్పుడు నన్నే కూర్చొని రాయమన్నారు. నేను, నాని గారు, నందిని అక్క ముగ్గురం కలిసి కూర్చున్నాం. ముగ్గురం మాట్లాడుకుంటూ కథకి ఒక స్క్రీన్ ప్లే ఫైనల్ చేసాం. ఆశిష్ విద్యార్ధి సీన్స్ కొన్ని యాడ్ చేసాం. తర్వాత మళ్ళీ షూట్ చేశారు కొన్ని సీన్స్. షూటింగ్ లో కూడా మళ్ళీ ఏదో డౌట్ వస్తే నేను వెళ్ళాను. నేను, తాగుబోతు రమేష్ కొన్ని అనుకోని తర్వాత నాని గారు, నేను కూర్చొని గంట సేపు డిస్కస్ చేసి ఫైనల్ చేసాము. అలా అలా మొదలైంది సినిమా పూర్తిచేసాము అని తెలిపారు.
Anil is the man behind the hilarious climax scene of “Ala modhalaindi” pic.twitter.com/wbvtyV16OT
— Kadavule Bhagatey (@Only_PSPK) January 20, 2025
అలా మొదలైంది సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో నానికి హీరోగా మంచి కెరీర్ ఏర్పడింది. నిత్యా మీనన్ కు తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా కూడా మంచి స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. ఇందుకు కారణం అనిల్ రావిపూడి అని ఈయన చెప్పడంతో అందరికి తెలిసింది.