Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ దాడిలో కొత్త మలుపు.. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు.. సైఫ్ బ్లడ్ శాంపిల్స్ తో చెకింగ్..
నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Saif Al Khan Blood Samples send to Testing with Attacker Dress
Saif Ali Khan : బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఇటీవల దొంగతనానికి వచ్చిన దుండగుడు అతనిపై కత్తితో దాడి చేయగా తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే. సైఫ్ అయిదు రోజులు హాస్పిటల్ లో ఉండి పలు సర్జరీల అనంతరం ఇటీవల జనవరి 21న డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాడు. అయితే ఇప్పటికే ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినా విచారణ ఇంకా కొనసాగుతుంది. నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
అయితే నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం అతనే ఆ దాడి చేసాడని పక్కాగా నిరూపించడానికి పోలీసులు మరిన్ని ఆధారాల కోసం వెతుకుతున్నారు. తాజాగా సైఫ్ బ్లడ్ శాంపిల్స్ ని టెస్టింగ్ కి తీసుకెళ్లారు పోలీసులు. దొంగతనానికి వచ్చిన నిందితుడు సైఫ్ పై కత్తితో దాడి చేయగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో నిందితుడి డ్రెస్ కి కూడా కొన్ని రక్తపు మరకలు ఉన్నాయి. దీంతో నిందితుడి డ్రెస్ పై ఉన్న రక్తం, సైఫ్ రక్తం ఒకటేనా అని పోలీసులు పరిశీలించనున్నారు. తాజాగా నిందిస్తుడి డ్రెస్ ని, సైఫ్ బ్లడ్ శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించారు.
అయితే నిందితుడి తండ్రి తన కొడుక్కి ఏమి తెలియదని మీడియాతో మాట్లాడటం, పలు బాలీవుడ్ కథనాల్లో సైఫ్ పై అతని భార్య కరీనానే దాడి చేయించిందని కథనాలు రావడంతో ఈ కేసు మరిన్ని మలుపులు తీసుకుంటుంది. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ లో రెండూ సైఫ్ బ్లడ్ అని తేలితే ఇతన్నే నిందితుడిగా కంఫర్మ్ చేసి కోర్టు ముందు పోలీసులు హాజరుపరుస్తారని తెలుస్తుంది. ఒకవేళ నిందితుడి దుస్తులపై ఉన్న రక్తం మరకలు సైఫ్ వి కాదని వస్తే మాత్రం కేసు మరో మలుపు తీసుకోవడం ఖాయం అంటున్నారు. అలాగే ఈ కేసులో ఒకరి కంటే ఎక్కువమంది ఇన్వాల్వ్ అయ్యారని పోలీసులు సందేహిస్తూ ఆ కోణంలో కూడా విచారిస్తున్నారు.
Also Read : SSMB 29 Memes : రాజమౌళి పోస్ట్.. మహేష్ రిప్లై.. మీమ్స్ తో ఆడేసుకుంటున్న నెటిజన్లు.. ఫ్రీ ప్రమోషన్..
పోలీసులు ఇప్పటికే సైఫ్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం సైఫ్ ఇంట్లోనే బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. వైద్యులు సైఫ్ ని కొన్నాళ్ల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని సూచించారు. సైఫ్ ఇంటి చుట్టూ పోలీసు బందోబస్త్ తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ, సీసీ కెమెరాలతో ఫుల్ భద్రతను ఏర్పాటు చేసారు. ఇక తనని సమయానికి హాస్పిటల్ కి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ ని సైఫ్ కలిసి ధన్యవాదాలు తెలిపాడు.