Raviteja : రామ్‌చరణ్ డాన్స్ అంటే ఇష్టం.. ప్రభాస్‌లో ఆ విషయం అంటే..

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు మూవీ ప్రమోషన్స్ లో ఉన్న రవితేజ రామ్ చరణ్, ప్రభాస్ మరికొందరు సౌత్ స్టార్స్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Raviteja : రామ్‌చరణ్ డాన్స్ అంటే ఇష్టం.. ప్రభాస్‌లో ఆ విషయం అంటే..

Raviteja about Ram Charan Dance and prabha Yash Rajamouli Vijay

Updated On : October 11, 2023 / 9:51 PM IST

Raviteja : మాస్ మహారాజ్ రవితేజ చేస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’. నూత‌న ద‌ర్శ‌కుడు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ భామ‌లు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. జీవి ప్ర‌కాశ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. దీంతో మూవీ పై హైప్ కూడా క్రియేట్ అయ్యింది.

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న రవితేజ బి టౌన్ లో తెగ సందడి చేస్తున్నాడు. అక్కడ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఈక్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో సౌత్ స్టార్స్ గురించి ప్రశ్నించగా రవితేజ ఇచ్చిన ఆన్సర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. రామ్ చరణ్ గురించి చెప్పమంటే.. తన డాన్స్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత ప్రభాస్ గురించి అడగగా బదులిస్తూ.. ప్రభాస్ కట్ అవుట్ అంటే ఇష్టమని, తను అందరి డార్లింగ్ అంటూ చెప్పుకొచ్చాడు.

Also read : Chiranjeevi : అమితాబ్ బచ్చన్ KBC షోలో చిరంజీవి ఎంట్రీ.. వీడియో చూశారా..?

అలాగే రాజమౌళి విజన్, తమిళ్ హీరో విజయ్ డాన్స్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు. కేజీఎఫ్ ఫేమ్ యశ్ గురించి ప్రశ్నించగా.. “యశ్ కి సంబంధించిన సినిమాలు నేను కేజీఎఫ్ మాత్రమే చూశాను. ఆ సినిమా చేయడం తనకి ఎంతో అదృష్టం” అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కి సిద్దమవుతుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ మూవీ స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కుతుంది.