×
Ad

Raviteja : రెడీ అవుతున్న రవితేజ బయోపిక్.. మాస్ మహారాజ పాత్రలో యూత్ యువరాజ..?

త్వరలో మాస్ జాతర అనే సినిమాతో రాబోతున్నాడు రవితేజ. (Raviteja)

Raviteja

Raviteja : సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు బయోపిక్స్ వస్తూ ఉంటాయి. సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు, వివిధ రంగాలకు చెందిన వారి జీవిత చరిత్రలను తెరకెక్కిస్తున్నారు. ఇదే కోవలో మాస్ మహారాజ రవితేజ బయోపిక్ కూడా రానుందట.(Raviteja)

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ హీరోగా మారి స్టార్ గా ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు రవితేజ. కానీ గత కొంతకాలంగా వరుసగా ఫ్లాప్స్ చూస్తున్నాడు. త్వరలో మాస్ జాతర అనే సినిమాతో రాబోతున్నాడు రవితేజ. అలాగే సిద్ధి జొన్నలగడ్డ తెలుసు కదా అనే సినిమాతో రాబోతున్నాడు. దీంతో ఈ ఇద్దరూ కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.

Also See : Samantha : సమంత లేటెస్ట్ ఫొటోలు.. ఓ వైపు పూజలు.. మరో వైపు జిమ్..

ఈ ఇంటర్వ్యూలో సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. నా కృష్ణ అండ్‌ హిజ్‌ లీల సినిమా రిలీజయిన తర్వాత కొన్నాళ్ళు మీ బయోపిక్ కోసం వర్క్ చేశాను అని తెలిపాడు. దీంతో రవితేజ.. బయోపిక్స్ లో ఆల్మోస్ట్ అందరూ పాజిటివ్ అంశాలనే చూపిస్తారు కానీ నెగిటివ్ అంశాలను కూడా చూపించాలి అన్నారు. దీనికి సిద్ధూ.. నేను కూడా అలాగే చూపిద్దామనుకున్నాను అని తెలిపాడు. రవితేజ.. భవిష్యత్తులో అవుతుందేమో చూద్దాం అని అన్నారు.

దీంతో కచ్చితంగా రవితేజ బయోపిక్ వస్తుందని, దాంట్లో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ రవితేజ రోల్ పోషించొచ్చు అని తెలుస్తుంది. మరి ఆ బయోపిక్ ఎప్పుడు వస్తుందో, అందులో రవితేజ లైఫ్ గురించి ఏమేం చూపిస్తారో చూడాలి. ఇటీవల రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ చిన్న గెస్ట్ పాత్రలో కనిపించి మాస్ మహారాజ కోసం యూత్ యువరాజ వచ్చాడు అని మెరిపించాడు. సిద్ధూ జొన్నలగడ్డ డాన్ శీను సినిమాలో కూడా నటించాడు.

Also Read : Constable Review : ‘కానిస్టేబుల్’ మూవీ రివ్యూ.. సీరియల్ కిల్లింగ్స్ తో సస్పెన్స్ థ్రిల్లర్..