Constable Review : ‘కానిస్టేబుల్’ మూవీ రివ్యూ.. సీరియల్ కిల్లింగ్స్ తో సస్పెన్స్ థ్రిల్లర్..

ఒకప్పుడు లవర్ బాయ్ గా అలరించిన వరుణ్ సందేశ్ రీ ఎంట్రీలో అన్ని ఆసక్తికర కథలతో డిఫరెంట్ జానర్స్ తో వస్తున్నాడు. (Constable Review)

Constable Review : ‘కానిస్టేబుల్’ మూవీ రివ్యూ.. సీరియల్ కిల్లింగ్స్ తో సస్పెన్స్ థ్రిల్లర్..

Constable Review

Updated On : October 11, 2025 / 2:26 PM IST

Constable Review : వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా తెరకెక్కిన సినిమా ‘కానిస్టేబుల్’. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. భవ్యశ్రీ, నిత్యశ్రీ, దువ్వాసి మోహన్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. కానిస్టేబుల్ సినిమా అక్టోబర్ 10న థియేటర్స్ లో రిలీజయింది.(Constable Review)

కథ విషయానికొస్తే.. శంకరపల్లి అనే గ్రామంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆడ మగ అనే తేడా లేకుండా పలువురు హత్యకు గురవుతూ ఉంటారు. దీంతో ఈ కేసు పోలీసులకు సవాలుగా మారుతుంది. ఊళ్ళో జనాలు కూడా ఎప్పుడు ఎవరు హత్యకు గురవుతారో అని భయపడతారు. ఆ ఊరి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటాడు కాశీ(వరుణ్ సందేశ్). ఈ క్రమంలో కాశీ మేనకోడలు కీర్తి(నిత్యశ్రీ)ని కూడా హత్య చేస్తారు.

దీంతో కాశీ ఈ కేసుని సీరియస్ గా తీసుకొని సపరేట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. కాశీకి అనుమానం వచ్చిన వాళ్ళు కూడా హత్య చేయబడటంతో కేసు మరింత సంక్లిష్టంగా అవుతుంది. మరి కానిస్టేబుల్ కాశీ ఈ హత్యలని చేధించాడా? ఈ క్రమంలో కాశీకి ఎదురైన ఇబ్బందులు ఏంటి? అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Oka Manasu : 9 ఏళ్ళ తర్వాత ఓటీటీలోకి వచ్చిన మెగా డాటర్ మొదటి సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..

సినిమా విశ్లేషణ..

ఇటీవల సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీలకు బాగానే డిమాండ్ ఉంది. ఒకప్పుడు లవర్ బాయ్ గా అలరించిన వరుణ్ సందేశ్ రీ ఎంట్రీలో అన్ని ఆసక్తికర కథలతో డిఫరెంట్ జానర్స్ తో వస్తున్నాడు. ఇటీవల వచ్చిన రొటీన్ మర్డర్ థ్రిల్లర్స్ కి కాస్త భిన్నంగానే ఈ సినిమాని ట్రై చేసారు. సస్పెన్స్ అనేది బాగానే మెయింటైన్ చేసారు. కొన్ని సీన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తి నెలకొంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు, ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం సగటు ప్రేక్షకుడు కనిపెట్టడం కష్టమే. ఒక మెసేజ్ కూడా ఇచ్చారు ఈ సినిమాతో.

సీరియస్ గా సాగే సినిమాలో మధ్యలో అక్కర్లేని ఐటం సాంగ్ ఎందుకో అర్థకాదు. కొన్ని సీన్స్ మాత్రం లాజిల్ లెస్ గా సిల్లీగా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే ఇంకాస్త పకడ్బందీగా రాసుకోవాల్సింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ జరగడంతో కొంతమందికి డైలాగ్స్ విషయంలో ఆ యాస సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలు చూడాలనుకునేవాళ్ళు మాత్రం థియేటర్ కి వెళ్లి చూసేయొచ్చు.

Constable Review

నటీనటుల పర్ఫార్మెన్స్.. సీరియస్ కానిస్టేబుల్ పాత్రలో వరుణ్ సందేశ్ కొత్తగా కనిపించి బాగా నటించాడు. మధులిక వారణాసి పర్వాలేదనిపించింది. భవ్య శ్రీ, నిత్య శ్రీ, దువ్వాసి మోహన్, రవివర్మ, మురళీధర్ గౌడ్, కల్పలత.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Raashii Khanna : పవన్ కళ్యాణ్ స్పీచ్ వస్తుందని షూటింగ్ ఆపేసిన డైరెక్టర్.. రాశీఖన్నా కామెంట్స్ వైరల్..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అందుకు తగ్గట్టే ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. ఎడిటింగ్ లో ఐటెం సాంగ్, కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండేది. రొటీన్ సీరియల్ కిల్లింగ్స్ కథ తీసుకున్నా కొత్త మెసేజ్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా రాసుకొని బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘కానిస్టేబుల్’ సినిమా సీరియస్ గా సీరియల్ కిల్లింగ్స్ తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.