Raviteja Brother Son Maadhav Introducing with Mr. Idiot Movie Trailer Released
Mr. Idiot : మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా ‘మిస్టర్ ఇడియట్’ అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. JJR ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యలమంచి రాణి సమర్పణలో నిర్మాత JJR రవిచంద్ నిర్మాణంలో పెళ్లి సందD ఫేమ్ డైరెక్టర్ గౌరీ రోణంకి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో సిమ్రాన్ శర్మ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. తాజాగా నేడు ‘మిస్టర్ ఇడియట్’ సినిమా ట్రైలర్ ఈవెంట్ నిర్వహించి హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ చూస్తుంటే ఫ్యాషన్ కాలేజీ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ కొత్త ప్రేమకథ అని తెలుస్తుంది. మీరు కూడా మిస్టర్ ఇడియట్ ట్రైలర్ చూసేయండి..
ఇక ఈ మిస్టర్ ఇడియట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుంది. నిర్మాత రవిచంద్ నా మిత్రుడు. గతంలో #బ్రో సినిమా చేసి ఓటీటీలో రిలీజ్ చేసాడు. ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతోనే సినిమా తీయాలని గౌరీ గారి దగ్గర స్క్రిప్ట్ విని ‘మిస్టర్ ఇడియట్’ చేసారు. మాధవ్, సిమ్రాన్ ఎక్కడా కొత్త యాక్టర్స్ లా అనిపించారు అని అన్నారు .
నిర్మాత JJR రవిచంద్ మాట్లాడుతూ.. మిస్టర్ ఇడియట్ తో ఒక మంచి సినిమా చేశాం. డైరెక్టర్ గౌరీ రోణంకి చాలా బాగా తీశారు. అనూప్ రూబెన్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. త్వరలో సాంగ్స్ రిలీజ్ చేస్తాం. ఈవెంట్ కి పిలవగానే వచ్చిన నా మిత్రుడు వేణుగోపాల్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి ధన్యవాదాలు. మాధవ్ నటనలో వాళ్ళ పెదనాన్న ఫీచర్స్ వచ్చాయి. అవి సినిమాలో చూస్తారు. సినిమా నవంబర్ లో రిలీజ్ చేస్తాం అని తెలిపారు.
డైరెక్టర్ గౌరి రోణంకి మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరక్టర్ అనూప్ గారికి సినిమా మొదట్లో ఈ సినిమా ఎలా అయినా హిట్ అవ్వాలని చెప్పాను. మా కథను అర్థం చేసుకుని మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీ చేసే అవకాశం ఇచ్చిన మా నిర్మాత రవిచంద్ గారికి థ్యాంక్స్. మాధవ్, సిమ్రాన్ గురించి చాలా చెప్పాలి. తర్వాత వచ్చే ఈవెంట్స్ లో చెప్తాను. ఈ సినిమాతో మాధవ్, సిమ్రాన్ స్టార్స్ అవ్వాలి. మిస్టర్ ఇడియట్ సినిమా అందరికి నచ్చుతుంది అని అన్నారు.
హీరో మాధవ్ మాట్లాడుతూ.. ఫస్ట్ టైమ్ మీడియా ముందు మాట్లాడుతున్నా. మిస్టర్ ఇడియట్ ట్రైలర్ లాంచ్ కు వచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారికి థ్యాంక్స్. ప్రశాంత్ వర్మ గారితో క్రికెట్ ఆడతాం, అలా మంచి పరిచయం ఉంది. సినిమా కొంచెం లేట్ అయింది. అవుట్ పుట్ మాకు నచ్చే వరకు రిలీజ్ చేయొద్దు అనుకున్నాం. ఇంకా మంచిగా రావాలని కొన్ని సీన్స్ రీ షూట్ చేసాము. లేట్ అయినా పర్పెక్ట్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ట్రైలర్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. మా డైరెక్టర్ గౌరి గారు నాకు ఒక మంచి మూవీ ఇచ్చారు. మా పెదనాన్న రవితేజ నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు. సినిమా నవంబర్ లో రిలీజ్ చేయబోతున్నాం అని అన్నారు. హీరోయిన్ సిమ్రాన్ మాట్లాడుతూ.. ఈ ట్రైలర్ లాంచ్ లో మాట్లాడాలని బాగా ప్రిపైర్ అయ్యాను. కానీ మీ అందరిని చూసాక మర్చిపోయాను. ట్రైలర్ రిలీజ్ కంటే సినిమాకు వెయ్యింతల మంది ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చి సినిమా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. డైరెక్టర్ గౌరీ ఒక ఫ్రెండ్ లా ఎంకరేజ్ చేసింది. మాధవ్ ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు అని అన్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. రవితేజ గారు ఇండస్ట్రీలో ఎంతోమందిని ఎంకరేజ్ చేశారు. అందులో నేను కూడా ఒకడిని. ఈ ఈవెంట్ కు పిలిచినప్పుడు మాధవ్ ను సపోర్ట్ చేయడం నా బాధ్యత అని భావించి వచ్చాను. నేనే కాదు ఇండస్ట్రీలో చాలా మంది మాధవ్ కు సపోర్ట్ చేస్తారు. CCLకు వెళ్లినప్పుడు రఘు గారు ఒక సాంగ్ చూపించి మిస్టర్ ఇడియట్ లో సాంగ్ అని చెప్పారు. హీరో ఎవరు అని అడిగితే మా అబ్బాయి మాధవ్ అని చెప్పారు. టైటిల్ మిస్టర్ ఇడియట్ అని చెప్పగానే నాకు ఇడియట్ సినిమా రోజులు గుర్తొచ్చాయి. అప్పట్లో నేను కూడా చంటిగాడిలా ఫీలయ్యేవాడిని. రవితేజ గారి స్థాయికి మాధవ్ చేరుకోవాలని కోరుకుంటున్నాను. మా సినిమా బాగుందని అనుకోవడం వేరు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి వాటిని సరిచేసుకున్నాం అని చెప్పడం గొప్ప విషయం. ఈ టీమ్ అలాంటి కరెక్షన్స్ చేసుకుంది అంటే అక్కడే సక్సెస్ అయినట్టే అని అన్నారు.