×
Ad

Raviteja : నా ఫేవరేట్ సినిమా అదే.. కానీ జనాలకు నచ్చలేదు.. ఫ్లాప్ సినిమాపై రవితేజ కామెంట్స్..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపాడు రవితేజ. (Raviteja)

Raviteja

Raviteja : ఒక్కోసారి మంచి సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ అవ్వవు. చాలా బాగుంటుంది అనుకున్న సినిమా ఏవో కారణాలతో జనాల్లోకి వెళ్లకపోవచ్చు. అలా చాలా మంచి సినిమాలు ఫ్లాప్స్ గా మిగిలి తర్వాత ఎప్పటికో క్లాసిక్స్ గా మారుతున్నాయి. తాజాగా రవితేజ తన ఫేవరేట్ సినిమా, తనకు నచ్చిన సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.(Raviteja)

రవితేజ మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపాడు రవితేజ.

Also See : Nithiin Son Birthday : హీరో నితిన్ తనయుడు ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు.. ఇప్పుడు కూడా ఫేస్ చూపించలేదుగా..

రవితేజ మాట్లాడుతూ.. రీసెంట్ గా వచ్చిన ఈగల్ నా ఫేవరేట్ సినిమా. అందులో నేను చేసిన పాత్ర కూడా ఫేవరేట్ క్యారెక్టర్ నా లైఫ్ లో. కానీ జనాలకు నచ్చలేదు. మంచి ఐడియా అది కానీ మనమేమి చేయలేము. నా ఆటోగ్రాఫ్ మెమరీస్ సినిమా కూడా అంతే నాకు చాలా ఇష్టం. కానీ ఆ సినిమా ఆడలేదు అని అన్నారు. గతంలో కూడా రవితేజ నేనింతే సినిమా ఇష్టమని, కానీ ఆ సినిమా జనాలకు ఎక్కలేదని అన్నారు.

కానీ నా ఆటోగ్రాఫ్ మెమరీస్, నేనింతే రెండు సినిమాలు ఇప్పుడు క్లాసిక్స్ గా మిగిలాయి. మరి కొన్నేళ్ళకు ఈగిల్ సినిమా కూడా క్లాసిక్ అవుతుందేమో. ఈగిల్ సినిమా మంచి పాయింట్, సాంకేతికంగా కూడా బాగుంటుంది కానీ స్క్రీన్ ప్లేతో జనాలు కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. అంత కన్ఫ్యూజ్ స్క్రీన్ ప్లే, కథని ముక్కలు ముక్కలుగా చెప్పడం లేకుండా మాములు స్క్రీన్ ప్లేతో చెప్పి ఉంటే బాగుండేది అని చాలా మంది సినిమా లవర్స్ అనుకున్నారు.

Also Read : Vishnu Priya : తెలుగు అమ్మాయిలకు ఆఫర్స్ ఇచ్చినా సీరియల్స్ చెయ్యట్లేదు.. నటి వ్యాఖ్యలు వైరల్..