Vishnu Priya : తెలుగు అమ్మాయిలకు ఆఫర్స్ ఇచ్చినా సీరియల్స్ చెయ్యట్లేదు.. నటి వ్యాఖ్యలు వైరల్..
తాజాగా నటి విష్ణుప్రియ ఈ కామెంట్స్ పై స్పందించింది.(Vishnu Priya)

Vishnupriya
Vishnu Priya : తెలుగు సీరియల్స్ లో ఎక్కువగా కన్నడ వాళ్ళే నటిస్తున్నారు. అక్కడక్కడా తమిళ్, మలయాళం వాళ్ళు కూడా నటిస్తున్నారు, తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వట్లేదు అని గత కొన్నాళ్లుగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా నటి విష్ణుప్రియ ఈ కామెంట్స్ పై స్పందించింది.(Vishnu Priya)
తెలుగు అమ్మాయి విష్ణుప్రియ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన విష్ణుప్రియ ఆ తర్వాత సీరియల్స్ లో బిజీ అయిపోయింది. గత కొన్నాళ్లుగా సీరియల్స్, టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉంది విష్ణుప్రియ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విష్ణుప్రియని సీరియల్స్ లో ఎక్కువగా కన్నడ వాళ్ళను తీసుకుంటున్నారు, మీకు అవకాశాలు తగ్గలేదా, తెలుగు వాళ్లకు ఛాన్సులు ఇవ్వట్లేదా అని ప్రశ్నించారు.
Also Read : Nagababu : ఈ సీనియర్ డ్యాన్సర్, మెగాస్టార్ వీరాభిమాని గుర్తున్నారా..? నాగబాబు ఇచ్చిన మాటకు ఎమోషనల్..
దీనికి విష్ణుప్రియ సమాధానం ఇస్తూ.. అసలు తెలుగు అమ్మాయిలు ఎక్కువగా సీరియల్స్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వెబ్ సిరీస్ లు, సినిమాలు అయితేనే చేస్తామని కూర్చుంటున్నారు. అవి రాకపోతే రీల్స్ చేసుకొని సోషల్ మీడియాలో ఫేమ్, డబ్బులు వస్తున్నాయి కదా అనుకుంటున్నారు. కొంతమందికి సోషల్ మీడియాలో చూసి సీరియల్ ఛాన్స్ ఉందని ఆఫర్ చేసినా వద్దంటున్నారు. కొంతమందికి ఇంట్లో వాళ్ళు వద్దంటారు.
ఇక్కడ నిర్మాతలు తెలుగు వాళ్ళని తీసుకొద్దామనే అనుకుంటారు. కానీ వాళ్ళు నో చెప్పడంతో వేరే భాష వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. అలాగే ప్రతి కొత్త సీరియల్ కి కొత్త ఫేసెస్ కావాలని అనుకుంటారు కాబట్టి వేరే భాష నటీనటులు కూడా పెరుగుతున్నారు. ఒక సీరియల్ లో ముగ్గురు తెలుగు వాళ్ళు ఉంటే అయిదుగురు వేరే భాష వాళ్ళు ఉంటున్నారు. కానీ వాళ్ళు మొదట భాషతో ఇబ్బందిపడినా బాగానే కష్టపడి నటిస్తున్నారు అని తెలిపింది. మరి విష్ణుప్రియ కామెంట్స్ చూసి అయినా తెలుగు అమ్మాయిలు సీరియల్స్ కి ఓకే చెప్తారా చూడాలి.
Also See : Allu Sneha Reddy : బన్నీతో క్యూట్ ఫొటోలు షేర్ చేసిన అల్లు స్నేహ రెడ్డి..