Nagarjuna – Raviteja : నాగార్జున, రవితేజ అలాంటి కథతో మల్టీస్టారర్ చేద్దామనుకున్నారట.. కానీ..!

నాగార్జున, రవితేజ కలిసి ఒక మల్టీస్టారర్ చేద్దామని అనుకున్నారట. అందుకోసం ఒక కథని కూడా స్ఫూర్తిగా తీసుకున్నారట. కానీ..

Raviteja multi starrer movie with Nagarjuna with bad boys story

Nagarjuna – Raviteja : టాలీవుడ్ హీరోలు నాగార్జున, రవితేజ కలిసి ఒక మల్టీస్టారర్ చేద్దామని అనుకున్నారట. వీరిద్దరూ కలిసి గతంలో కొన్ని సినిమాల్లో నటించారు. అయితే అప్పుడు నాగార్జున హీరోగా నటిస్తే.. రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. రవితేజ స్టార్ హీరో అయిన తరువాత ఒక యాక్షన్ స్టోరీతో ఇద్దరు కలిసి సినిమా చేద్దామని అనుకున్నారట. అందుకోసం ఒక కథని కూడా స్ఫూర్తిగా తీసుకున్నారట. ఈ విషయాన్ని రీసెంట్ గా వీరిద్దరూ బయట పెట్టారు. ఇంతకీ ఆ కథ ఏంటి..?

Also read : Vijay Antony : కూతురి మరణంపై విజయ్ ఆంటోనీ ఎమోషనల్ ట్వీట్.. నువ్వు 16 ఏళ్లు మాత్రమే జీవిస్తావని..

హాలీవుడ్ మూవీ ‘బ్యాడ్ బాయ్స్’ తరహాలో ఒక సినిమా చేద్దామని అనుకున్నారట. బ్యాడ్ బాయ్స్ స్టోరీ ఇద్దరు పోలీసులు చుట్టూ తిరుగుతుంది. ఆ ఇద్దరు కలిసి హీరోయిన్ ఎలా కాపాడారు అనేది స్టోరీ. అయితే ఈ మల్టీస్టారర్ సెట్ చేయడం ఇప్పటి వరకు వర్క్ అవుట్ అవ్వలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా కుదిరితే.. అలాంటి సినిమా చేస్తామని చెప్పుకొచ్చాడు. అలాంటి ఒక కథ సిద్ధం చేయమని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి చెబుతాను అంటూ రవితేజ వ్యాఖ్యానించాడు. కార్తీక్ ప్రస్తుతం రవితేజతో ‘ఈగల్’ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.

సంక్రాంతి కానుకగా ‘ఈగల్’ రెడీ అవుతుంది. సంక్రాంతి సమయంలోనే నాగార్జున ‘నా సామిరంగా’ కూడా రిలీజ్ కాబోతుంది. కాగా రవితేజ ఈ పండక్కి ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో రాబోతున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి సిద్దమవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న రవితేజ టాలీవుడ్ టు బాలీవుడ్ సందడి చేస్తున్నాడు. ఈక్రమంలోనే తెలుగు బిగ్‌బాస్ షోకి కూడా రాగా.. అక్కడ నాగార్జునతో మూవీ గురించి మాట్లాడాడు.