Ravanasura Movie: రావణాసుర ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఏమై ఉంటుందా..?
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా మూవీ ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో రవితేజ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందట. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రవితేజ కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Raviteja Ravanasura Movie Update Tomorrow
Ravanasura Movie: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా మూవీ ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో రవితేజ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందట. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రవితేజ కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
Ravanasura : రావణాసుర గ్లింప్స్ రిలీజ్.. హీరోలు ఉండరు.. రవితేజ విలనా??
కాగా, ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా నుండి ఓ సాలిడ్ అప్డేట్ రేపు ఉదయం 10.08 గంటలకు ఇవ్వబోతున్నట్లు రావణాసుర చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో మాస్ రాజా ఫ్యాన్స్ ఈ అప్డేట్ ఏమై ఉంటుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా నుండి ఓ సాంగ్ అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుండగా.. ఈ సినిమా పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
కాగా, ఈ సినిమాలో సుశాంత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామలు అను ఎమ్మాన్యుయెల్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నాగర్కర్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 7న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
#Ravanasura Update Tomorrow 10.08 a.m stay tuned ❤️❤️❤️
— ABHISHEK PICTURES (@AbhishekPicture) February 12, 2023