Chiru 154 : మెగాస్టార్‌తో మాస్ మహారాజా..
మెగాస్టార్ చిరంజీవితో కలిసి మాస్ మహారాజా రవితేజ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది..

Chiru 154
Chiru 154: మెగాస్టార్ చిరంజీవితో మాస్ మహారాజా రవితేజ కలిసి నటించబోతున్నారా.. అంటే అవుననే మాట వినిపిస్తోంది. మెగాస్టార్ జెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ రిలీజ్‌కి రెడీ అవుతుండగానే.. ‘లూసీఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ స్పీడప్ చేసేశారు.
Chiranjeevi:ఇబ్బంది పెట్టొద్దు.. పట్టించుకోండి ప్లీజ్.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ బాబీతోనూ ఓ సినిమా కన్ఫమ్ చేసేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవితో కలిసి రవితేజ కూడా నటించబోతున్నాడట.
Chiru 154 : ‘వాల్తేరు వీరయ్య’ గా చిరంజీవి..?
చిరుకి వీరాభిమాని అయిన రవితేజ కూడా ఆయనలానే కష్ట పడి పైకొచ్చాడు. ఇంతకుముందు ‘అన్నయ్య’ సినిమాలో చిరు ఇద్దరు తమ్ముళ్లలో ఒకడిగా నటించాడు రవితేజ. బాబీ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడానికి రవితేజను ఫిక్స్ చేశారట. ఈ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది.
Maa Elections 2021 : ఎవడు పడితే వాడొచ్చి ‘మా’ లో కూర్చుంటే కుదరదు
పాండమిక్ తర్వాత ఈ సంక్రాంతికి ‘క్రాక్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టిన రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నాడు. మాస్ మహారాజా డ్యెయెల్ రోల్ చేసిన ఈ చిత్రం మే లో విడుదల కావాల్సి ఉండగా అప్పటి పరిస్థితులను బట్టి వాయిదా వేశారు. అలాగే శరత్ మండవ డైరెక్షన్లో ‘రామారావ్ – ఆన్ డ్యూటీ’ అనే సినిమా కూడా చేస్తున్నారు రవితేజ.