Chiru 154 : ‘వాల్తేరు వీరయ్య’ గా చిరంజీవి..?

చిరు 155 చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది..

Chiru 154 : ‘వాల్తేరు వీరయ్య’ గా చిరంజీవి..?

Chiru 154

Updated On : August 22, 2021 / 4:34 PM IST

Chiru 154: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. ఆయన నటిస్తున్న, నటించబోయే కొత్త సినిమాల అప్‌డేట్స్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీలో, మెగా ఫ్యాన్స్‌లో సందడి వాతావరణం నెలకొంది. చిరు బర్త్‌డే అప్‌డేట్స్‌తో సోషల్ మీడియా షేక్ అవుతోంది.

Chiranjeevi : బాస్ బర్త్‌డే.. మెగా అప్‌డేట్స్ వచ్చేస్తున్నాయ్..

‘ఆచార్య’ రెండు సాంగ్స్ బ్యాలెన్స్ ఉండగానే ‘లూసీఫర్’ రీమేక్ పట్టాలెక్కించిన చిరు.. తర్వాత యంగ్ డైరెక్టర్ బాబీతో సినిమా చెయ్యబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. బాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

Chiranjeevi : ఆగస్టు 22, సెప్టెంబర్ 22.. చిరు జీవితంలో మర్చిపోలేని రోజులు..

ఈ క్రేజీ ఫిలింకి సంబంధించిన అప్‌‌‌డేట్ ఆగస్టు 22 సాయంత్రం 4:05 గంటలకు ఇవ్వనున్నారు. చిరు 154 చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యబోతున్నారని సమాచారం. దీని తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ ప్లాన్ చేశారు చిరు.