Raviteja: సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నా.. కానీ ఫెయిల్ అయ్యింది.. రవితేజ కామెంట్!

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ నేడు మంచి అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ బాగా కష్టపడింది. ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో రవితేజ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Raviteja Wished This Movie Should Have Been Hit

Raviteja: మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ నేడు మంచి అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ బాగా కష్టపడింది. ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో రవితేజ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Dhamaka: ధమాకా టార్గెట్ ఎంతో తెలుసా.. మాస్ రాజా చరిష్మాతో సాధ్యమే!

ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకున్నానని.. కానీ ఫెయిల్ అయ్యిందంటూ రవితేజ చెప్పిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ధమాకా ఇవాళే రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ వీడియోను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే అసలు మ్యాటర్ వేరే ఉంది. ఆ వీడియోను ముందునుండీ చూస్తేనే అసలు విషయం తెలుస్తోంది. థమాకా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రవితేజ తన కెరీర్‌లో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకోగా, అది ఫ్లాప్ మూవీగా నిలిచిన ‘నా ఆటోగ్రాఫ్’, ‘నేనింతే’ సినిమాల ప్రస్తావన తీసుకొచ్చాడు.

Dhamaka: ధమాకాలో ముద్దులు అందుకే లేవంటోన్న రవితేజ..?

ఆ రెండు సినిమాలు కూడా తనకు చాలా ఇష్టమని.. అయితే ఆ సమయంలో ప్రేక్షకులు ఆ సినిమాలను రిజెక్ట్ చేయడం తనకు బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు ఈ స్టార్ హీరో. అయితే కొందరు ధమాకా ఫోటో పెట్టి ఈ వీడియోతో ట్రోలింగ్ చేస్తుండటంతో రవితేజ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ధమాకా మూవీలో మాస్ రాజా సరసన అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేశాడు.