Raw NTR : ఇన్నాళ్లు హడావిడి చేసి.. ఇప్పుడు సేవలు ఆపేస్తున్నామన్న ‘రా ఎన్టీఆర్’.. జూ.ఎన్టీఆర్ చెప్పారా?
ఓ వారం రోజులు హడావిడి చేసిన రా ఎన్టీఆర్ సంస్థ తాజాగా.. (Raw NTR)
Raw NTR
Raw NTR : గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో రా ఎన్టీఆర్ అనే సంస్థ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకున్న రా ఎన్టీఆర్ సంస్థ ఇటీవల తిరుపతిలో ఓ మీటింగ్ ఉంటుందని, ఎన్టీఆర్ వస్తారని, వంద కోట్లతో సహాయ కార్యక్రమాలు చేస్తామని, అందుకు విరాళాలు కూడా సేకరిస్తామని చెప్పడం, అది ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అని వార్తలు రావడం, ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి దాంతో మాకెలాంటి సంబంధం లేదు, ఎన్టీఆర్ పేరు వాడొద్దు అని చెప్పడంతో అది పెద్ద చర్చగా మారింది.
ఆ ఇష్యూ అక్కడితో ఆగకుండా రా ఎన్టీఆర్ అధినేత సాయి రూప్ తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి.. అసలు ఎన్టీఆర్ కి ఆ లెటర్ గురించి తెలీదు. ఎన్టీఆర్ కి మమ్మల్ని కలవడానికి సమస్య ఏంటి? ఎన్టీఆర్ చెప్తేనే ఈ సేవా కార్యక్రమాలు ఆపేస్తాం. ఎవరు అడ్డుకున్నా ఇవి జరుగుతాయి. వంద కోట్లతో సేవా కార్యక్రమాలు చేస్తాము అని ఫైర్ అయ్యాడు. దీంతో ఈ వార్త మరింత వైరల్ అయి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సాయి రూప్ పై పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ పీఆర్ టీమ్ కూడా రా ఎన్టీఆర్ తో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో రా ఎన్టీఆర్ పై విమర్శలు వచ్చాయి.
ఓ వారం రోజులు హడావిడి చేసిన రా ఎన్టీఆర్ సంస్థ తాజాగా.. మా సేవలను నిరవధికంగా ఆపేస్తున్నాము అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో మరోసారి వీళ్ళ తీరు చర్చగా మారింది. ఎన్టీఆర్ చెప్తేనే ఆపేస్తాం అన్నారు, మరి ఎన్టీఆర్ చెప్పారా వీళ్ళను ఆపేయమని అని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ పేరుతో ఈ సంస్థ ఇప్పటివరకు కలెక్ట్ చేసిన డబ్బులు ఏం చేస్తారు? ఎన్టీఆర్ ని ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు కలిసారా? ఎందుకు సేవలు ఆపేస్తామని ప్రకటించారు అని ఇప్పుడు మరోసారి చర్చగా మారింది. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా వివరణ ఇస్తారేమో చూడాలి.
