×
Ad

Rayudu Gari Taluka : ‘రాయుడి గారి తాలుకా’ కొత్త సినిమా.. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన సుమన్..

తాజాగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని నటుడు సుమన్‌ రిలీజ్ చేసారు. (Rayudu Gari Taluka)

Rayudu Gari Taluka

Rayudu Gari Taluka : శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్‌ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్‌ శ్రీ దర్శకత్వంలో నిత్యశ్రీ, పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ, పీజే దేవి, కరణం పేరినాయుడు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Rayudu Gari Taluka)

సుమన్, కిట్టయ్య, R.K నాయుడు, సలార్ పూజ, కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది.

Also See : Gayathri Simhadri : కార్తీక దీపం విలన్ ని గుర్తుపట్టారా..? సీరియల్ లో అలా.. బయట ఇలా.. ఫొటోలు వైరల్..

తాజాగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని నటుడు సుమన్‌ రిలీజ్ చేసారు. అనంతరం హీరో శ్రీనివాస్ ఉలిశెట్టి మాట్లాడుతూ.. డిఫరెంట్‌ కంటెంట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. నటీనటులు అంతా కొత్తవారే అయినా బాగా నటించారు. మంచి కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం అని తెలిపారు.

Also Read : Hyper Aadi : అప్పట్లోనే 20 లక్షలు అప్పు.. మా నాన్నేమో బాగా తాగేవాడు.. హైపర్ ఆది ఎమోషనల్..