RC 16 : ఆర్‌సీ16 నుంచి జాన్వీకపూర్ ఫస్ట్‌లుక్ రిలీజ్.. జాన్వీ రోల్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన దర్శకుడు..
జాన్వీకపూర్ బర్త్ డే సందర్భంగా ఆర్‌సీ16 చిత్ర బృందం విషెస్ తెలియజేసింది.

RC16 movie birthday wishes to Janhvi Kapoor
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. 2018లో ‘ధడక్’ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ చిన్నది చాలా తక్కువ సమయంలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడాది ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్‌సీ16లోనూ ఛాన్స్ దక్కించుకుంది. కాగా.. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు (మార్చి 6) నేడు. అమ్మడు నేడు 28వ వసంతంలోకి అడుగుపెడుతోంది.
ఈ సందర్భంగా జాన్వీకపూర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేసింది ఆర్‌సీ 16 చిత్ర బృందం. మూవీలోని ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో జాన్వీకపూర్ కుడి చేత్తో మేకపిల్లను ఎత్తుకోగా, ఎడమ చేత్తో గడ్డి మొక్కను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Madraskaaran : ‘మద్రాస్ కారన్’ మూవీ రివ్యూ.. నిహారిక తమిళ సినిమా ఎలా ఉందంటే..
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్నట్లుగా తెలుస్తోంది. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో జగపతి బాబు ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Wishing you a very Happy Birthday #janhvikapoor Loved working with you and I can’t wait for everyone to see your terrific character on screen🔥 #RC16 pic.twitter.com/t0bbBtWaiO
— BuchiBabuSana (@BuchiBabuSana) March 6, 2025
Venkatesh : 300 కోట్ల హిట్ తర్వాత.. వామ్మో ఇప్పటికే 25 కథలను రిజెక్ట్ చేసిన వెంకీమామ..
మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.