Venkatesh : 300 కోట్ల హిట్ తర్వాత.. వామ్మో ఇప్పటికే 25 కథలను రిజెక్ట్ చేసిన వెంకీమామ..

సంక్రాంతికి వస్తున్నాం అంటూ సంక్రాంతికి పండగకు వచ్చిన వెంకీ మామ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు.

Venkatesh : 300 కోట్ల హిట్ తర్వాత.. వామ్మో ఇప్పటికే 25 కథలను రిజెక్ట్ చేసిన వెంకీమామ..

Venkatesh rejects Movie Scripts after Sankranthiki Vasthunnam Movie Success

Updated On : March 5, 2025 / 9:51 PM IST

Venkatesh : సంక్రాంతికి వస్తున్నాం అంటూ సంక్రాంతికి పండగకు వచ్చిన వెంకీ మామ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించి వసూళ్ల వర్షం కురిపించాడు. 300 కోట్ల గ్రాస్‌కు పైగా కలెక్ట్ చేసింది సంక్రాంతి వస్తున్నాం మూవీ. అయితే ఈ సినిమా హిట్ ఇచ్చిన కిక్‌తో హీరో వెంకటేష్‌ చాలా జాగ్రత్తపడుతున్నాడట. ఇకపై చేసే సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు.

సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ తర్వాత దాదాపుగా ఇప్పటికే 25కు పైగా కథలు విన్నాడని టాక్. అయితే ఒక్కటి కూడా ఓకే చేయలేదు వెంకీ. ఏ మాత్రం కొద్దిగా బాలేదు అని అనిపించినా ఎంత పెద్ద డైరెక్టర్ అయిన సరే రిజెక్ట్ చేసేస్తున్నాడని తెలుస్తోంది.

Also Read : Tamil Stars : పేరు పక్క ట్యాగ్స్ వద్దంటున్న తమిళ స్టార్స్.. సడెన్ గా ఏమైందో.. లిస్ట్ పెరుగుతుందిగా..

గతంలో F2, F3 సక్సెస్ తర్వాత శైలేష్ కొలను డైరెక్షన్‌లో సైంధవ్ అనే యాక్షన్ సినిమా చేశాడు. ఆ మూవీ డిజాస్టర్‌గా మిగిలింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్‌ను కంటిన్యూ చేసేందుకు జాగ్రత్తగా అడుగులు వేయాలని డిసైడ్ అయ్యాడట వెంకీ మామ. తన దగ్గరికి వస్తున్న ఏ స్టోరీ ఆయనకు నచ్చడం లేదట.

కొత్త డైరెక్టర్స్ నుంచి సీనియర్ డైరెక్టర్ల వరకు స్టోరీలు చెప్తున్నా ఎవరికీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం లేదని టాక్. ఆలస్యం అయినా సరే మరో మంచి హిట్‌ సినిమాతో రావాలని డిసైడ్ అయ్యాడట. 300 కోట్ల రీజినల్ బ్లాక్ బస్టర్ తర్వాత చేసే సినిమా అంటే ఆ మాత్రం జాగ్రత్తలు, వడపోతలు ఉండాలి. లేదంటే మళ్లీ ఫ్లాప్ పడిదంటే మార్కెట్ లెక్కలు, క్రేజ్ మారిపోతాయ్‌. వెంకీ మామ జాగ్రత్తలోనూ ఓ అర్థం ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇన్ని రిజెక్ట్ చేస్తున్నారు సరే నెక్ట్స్ ఎలాంటి మూవీకి ఓకే చెప్తారా అని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.