Tamil Stars : పేరు పక్క ట్యాగ్స్ వద్దంటున్న తమిళ స్టార్స్.. సడెన్ గా ఏమైందో.. లిస్ట్ పెరుగుతుందిగా..

తాజాగా తమిళ స్టార్స్ తమకు బిరుదులు, స్పెషల్ ట్యాగ్స్ ఏం వద్దంటూ ఒక్కొక్కరు బాయ్ కాట్ చేస్తున్నారు.

Tamil Stars : పేరు పక్క ట్యాగ్స్ వద్దంటున్న తమిళ స్టార్స్.. సడెన్ గా ఏమైందో.. లిస్ట్ పెరుగుతుందిగా..

Ajith Kamal Haasan Nayanthara Tamil Stars Rejects Special Tags

Updated On : March 5, 2025 / 9:30 PM IST

Tamil Stars : సినిమా స్టార్స్ కి ముందు ఉండే ట్యాగ్ ఆ హీరో ఇమేజ్ ని ఇండికేట్ చేస్తుంది. థియేట‌ర్ల‌లో హీరో ఎంట్రీకి ముందు వారి పేరుతో పాటు వారికి ఉన్న స్పెషల్ ట్యాగ్ పడగానే ఫ్యాన్స్ ఈల వేసి గోల చేస్తారు. స్టార్ హీరోలకు, హీరోయిన్లకు, దర్శకులకు అభిమానులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చే బిరుదులంటే భలే ఇష్టం. మెగాస్టార్, పవర్ స్టార్, సూప‌ర్ స్టార్, గ్లోబర్ స్టార్, ఐకాన్ స్టార్, నేచురల్ స్టార్ అబ్బో చెప్పుకుంటూ పోతే.. ఆ లిస్ట్ పూర్తవ్వదు.

ఈ ట్యాగ్ ట్రెండ్ ఒక్క టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఇండస్ట్రీ ఏదైనా హీరో ఎవరైనా ట్యాగ్ నేమ్స్ గ్యారెంటీ. హీరోలే కాదు హీరోయిన్లు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అభిమానులు ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతున్నారు. స్టార్స్ తమ పేర్ల కంటే వారి ట్యాగ్స్​తోనే ప్రేక్షకుల మదిలో ఉండిపోతున్నారన్నది వాస్తవం.

Also Read : HariHara VeeraMallu : హరిహర వీరమల్లు షూటింగ్ అప్డేట్.. అసెంబ్లీ సమావేశాలు అవ్వగానే.. మరో పక్క..

అయితే తాజాగా తమిళ స్టార్స్ తమకు బిరుదులు, స్పెషల్ ట్యాగ్స్ ఏం వద్దంటూ ఒక్కొక్కరు బాయ్ కాట్ చేస్తున్నారు. తమను తమ పేరుతో సంభోదిస్తే చాలని, ప్రత్యేకమైన బిరుదులను పెట్టవద్దని బహిరంగంగా అభిమానులను వేడుకుంటున్నారు. తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార తన ఫ్యాన్స్ కి ఇలాంటి రిక్వెస్టే చేశారు. కొంతకాలంగా లేడీ సూపర్ స్టార్ అనే పేరును నయన్ పేరు ముందు తగిలించారు. ఆమె ఇటీవల ఉత్తరాదిలోకీ అడుగుపెట్టి అక్కడా ‘జవాన్’ సినిమాతో తన సత్తాను చాటింది. దాంతో ఉత్తరాది వారు సైతం నయన్ ను ‘లేడీ సూపర్ స్టార్’ అనడం మొదలైంది.

అయితే తన పేరు ముందు ఇలాంటివేవీ ఇక మీద పెట్టవద్దని నయనతార ఓపెన్ లెటర్ రిలీజ్ చేశారు. అభిమానులు అలా పిలవడం తనకు ఆనందంగా ఉన్నా, నయనతార అని పిలవడం, రాయడమే తనకు సంతోషంగా ఉంటుంటుందన్నారు. మీరు ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్‌ బిరుదు వెలకట్టలేనిదని, అయినా ఆ పిలుపు తనను కాస్త ఇబ్బంది పెడుతుందని తన మనసులో మాట చెప్పేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె చేతిలో 8 సినిమాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కేవలం తన డాక్యుమెంటరీతో ప్రేక్షకులను పలకరించింది కానీ ఈ ఏడాది మాత్రం ఆమె నటించిన చిత్రాలు అర డజనుకు పైగానే రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీలో నటిస్తోంది నయన్.

అంతకు ముందు తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ సైతం తన ఫ్యాన్స్ ఇలానే రిక్వెస్ట్ చేశారు. కమల్‌హాసన్‌ ‘ఉలగనాయగన్’ అనే ట్యాగ్‌తో పిలుస్తారు. టాలీవుడ్ అభిమానులు లోకనాయుడు, విశ్వనటుడు అంటూ సంబోధిస్తారు. తనను ఎవరూ అల పిలవకూడదని కమల్ రిక్వెస్ట్ చేశారు. కమల్ అనే పిలుపులోనే ఆత్మీయత ఉంటుందని అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారాయన. సినీ రంగంలో తనను తాను నిత్య విద్యార్థిగానే భావిస్తానని, ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటానని ఆ లెటర్ లో రాసుకొచ్చారు కమల్. తాను గొప్పవాడ్ని అని భావించలేనని, అందుకే అన్ని బిరుదులను తిరస్కరిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం కమల్ హాసన్ థగ్ లైఫ్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మణిరత్నం డైరెక్షన్ వస్తున్న ఈ మూవీ ఈ ఏడాది జూన్ 5న రిలీజ్ కానుంది.

Also Read : Samantha : సమంత ఫస్ట్ సినిమా ‘ఏ మాయ చేసావే’ కాదా? ఆ హీరోతో..? ఆ హీరో సమంతకు బెస్ట్ ఫ్రెండ్ తెలుసా..?

తమిళ స్టార్ హీరో అజిత్‌ కూడా తన బిరుదుని బాయ్ కాట్ చేశారు. తనకు పేరుకు ముందు ‘తల అని కాదల్‌ మన్నన్‌’ అని పిలుస్తారు. అయితే ఆ పేర్లు తనకు ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పాడు అజిత్. అభిమానులతో పాటు సినీ పరిశ్రమ, మీడియాలో ఎవరూ కూడా తన పేరుకు ముందు ఆ పదంతో పిలవకూడదని విజ్ఞప్తి చేస్తూ ఓ ప్రెస్‌ నోట్‌ను విడుదల చేశారు. పబ్లిక్‌ ఈవెంట్స్‌, మీటింగ్స్‌, లేదా ఎక్కడైనా తాను కనిపించినప్పుడు కడవులే అజిత్‌ అంటూ స్లోగన్స్‌ చేస్తే అవి తనను ఎంతో ఇబ్బందిపెడుతున్నాయని చెప్పుకొచ్చారు. తన పేరుకు ఇతర బిరుదులను తగిలించడం తనకు నచ్చడం లేదన్నారు. తనను అజిత్ అని పిలిస్తే చాలు అని తన ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేశారు.

ఇలా తమిళ్ స్టార్స్ ఒక్కొక్కరు తమకు ట్యాగ్స్ వద్దు అంటున్నారు. బిరుదులను బాయ్ కాట్ చేస్తున్న వారి జాబితాలో కమల్ హాసన్, అజిత్ తో పాటు నయనతార కూడా చేరిపోయింది. మరి నయనతార తర్వాత ఇంకా చాలా మంది హీరో హీరోయిన్లు కూడా ఇలాంటి రిక్వెస్ట్ చేసే అవకాశముందనే గాసిప్ కోలీవుడ్ లో బిగ్ సౌండ్ చేస్తోంది. మరి లిస్ట్ లోకి ఇంకెవరెవరు వస్తారో చూడాలి.