HariHara VeeraMallu : హరిహర వీరమల్లు షూటింగ్ అప్డేట్.. అసెంబ్లీ సమావేశాలు అవ్వగానే.. మరో పక్క..
ప్రస్తతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగుతున్నాయి. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ అసెంబ్లీ సెషన్ కి రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారు.

Pawan Kalyan HariHara VeeraMallu Movie Shooting Update
HariHara VeeraMallu : హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. పవన్ కల్యాణ్ జస్ట్ నాలుగు రోజులు డేట్స్ ఇస్తే చాలని మేకర్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇటు మెగా ఫ్యాన్స్ కూడా వీరమల్లుని థియేటర్లలో చూడాలని ఉవ్విల్లురుతున్నారు. ఇప్పుడు పవన్ డేట్స్ ఇచ్చే గోల్డెన్ డేస్ దగ్గరలోనే ఉన్నాయట. కొన్ని రోజుల క్రితం డేట్స్ ఇచ్చినప్పటికీ మూవీ షూటింగ్ పూర్తికాలేదు. ఇప్పుడు మరోసారి డేట్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట పవన్ కల్యాణ్.
ప్రస్తతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగుతున్నాయి. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ అసెంబ్లీ సెషన్ కి రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారు. అందుకే డేట్స్ ఇవ్వలేకపోతున్నారు పవన్. అయితే అసెంబ్లీ సమావేశాలు పూర్తవ్వగానే సెట్స్ మీదకు వస్తానని చెప్పారట పవన్. దీంతో నిర్మాతలు మూవీ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసి, థియేటర్లోకి తీసుకొచ్చే సన్నాహాల్లో మునిగిపోయారు.
Also Read : Samantha : సమంత ఫస్ట్ సినిమా ‘ఏ మాయ చేసావే’ కాదా? ఆ హీరోతో..? ఆ హీరో సమంతకు బెస్ట్ ఫ్రెండ్ తెలుసా..?
ఇప్పటికే హరి హరవీరమల్లు మూవీ ఫస్టాఫ్ ఎడిటింగ్ కూడా పూర్తయ్యిందట. ఇక సెకండ్ పార్ట్ ఎడిటింగ్ కూడా జరుగుతుందని తెలుస్తోంది. సినిమాటో గ్రాఫర్ మనోజ్ డీఐ వర్క్ చేస్తున్నారట. పవన్ సీన్లు తప్పితే మిగిలిన కంటెంట్‌కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుందట. జస్ట్ పవన్‌పై సీన్లు చిత్రీకరించి, వాటిని ఏ ఏ ప్లేస్‌లో పెట్టాలో మెర్జ్ చేయడమే మిగిలి ఉందని తెలుస్తుంది.
మరోవైపు తాడేపల్లి ప్రాంతాల్లో సత్యరాజ్, ఈశ్వరి రావుపై మేకర్స్ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గండికోటలో ‘హరిహర వీరమల్లు’ మూవీ టీమ్ సందడి చేసిన ఫోటోలు బయటకొచ్చాయి. మాధవరాయ స్వామి ఆలయంలో శివాలయం సెట్టింగ్ వేసి, పురోహితుడుగా సీనియర్ నటుడు సత్యరాజ్ పై కొన్ని సీన్స్ ను షూట్ చేశారు.
నిజానికి హరిహర వీరమల్లు సినిమాని మార్చి 28న విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఆ డేట్ కి రావడం అనుమానంగానే ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15వరకు జరగనున్నాయి. ఆ తర్వాత పవన్ కల్యాణ్ డేట్స్ ఇస్తే ఈ నెల 20 వరకు షూటింగ్ కంప్లీట్ చేసే చాన్స్ ఉంది. ఇక ఎడిటింగ్ వర్క్ ని మరో నాలుగు రోజుల్లో ఫినిష్ చేసి మార్చి 28 వరకు సెకండ్ పార్ట్ ని కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ మూవీ ప్రమోషన్ కి ఏమాత్రం టైమ్ ఉండదు. దీంతో మార్చి 28న హరి హరవీరమల్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు అదే రోజును నితిన్ రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు లాక్ చేసుకొని ప్రమోషన్ తో దూసుకెళ్తున్నాయి.
Also Read : Jayaprada : గోదావరి ఒడ్డున సోదరుడికి జయప్రద పిండప్రదానం.. తమ్ముడ్ని తలుచుకుంటూ ఎమోషనల్..
అయితే హరిహర వీరమల్లు సినిమా కాస్త ఆలస్యమైనా పవన్ కల్యాణ్ పొలిటిక్ మైలేజ్ ని మరింత పెంచేలా సినిమా ఉంటుందని చెబుతున్నారు మేకర్స్. సామ్రాజ్యవాదులకు చుక్కలు చూపిస్తూ, స్వాతంత్య్రం కోసం పోరాడే యోధుడుగా కనిపించనున్నారు పవన్ కల్యాణ్. జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటివరకు హరిహరవీరమల్లు మూవీకి సంబంధించి ఓ టీజర్, రెండు లిరికల్ సాంగ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. అయితే అసలు సిసలైన హైప్ పెంచే ట్రైలర్ ఇంతవరకు రాలేదు. ఎప్పుడొస్తుందో కూడా క్లారిటీ లేదు. సినిమా విడుదలపై ఎలాంటి మార్పులున్నా అధికారిక ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మార్చి 28నే విడుదల అనుకుంటే ప్రచార వ్యూహాన్ని మార్చుకోవాలి. లేదంటే వాయిదా పడటం ఖాయం అనే విషయాన్ని మేకర్స్ క్లారిటీ ఇవ్వాలి. మరి హరిహర వీరమల్లు టీమ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.