Jayaprada : గోదావరి ఒడ్డున సోదరుడికి జయప్రద పిండప్రదానం.. తమ్ముడ్ని తలుచుకుంటూ ఎమోషనల్..

తాజాగా నేడు రాజమండ్రిలో నటి జయప్రద సోదరుడు రాజబాబుకు పిండప్రదానం జరిగింది.

Jayaprada : గోదావరి ఒడ్డున సోదరుడికి జయప్రద పిండప్రదానం.. తమ్ముడ్ని తలుచుకుంటూ ఎమోషనల్..

Jayaprada Got Emotional While Remembering her Brother in Rajahmundry

Updated On : March 5, 2025 / 7:45 PM IST

Jayaprada : అలనాటి హీరోయిన్ జయప్రద ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. తను రాజమండ్రిలోనే పుట్టి పెరిగింది. ఇటీవల రాజమండ్రిలో నివాసం ఉంటున్న తన సోదరుడు రాజబాబు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు రాజమండ్రిలో నటి జయప్రద సోదరుడు రాజబాబుకు పిండప్రదానం జరిగింది. గోదావరి ఒడ్డున ఈ కార్యక్రమం జరగ్గా జయప్రద దీనికి హాజరైంది.

రాజబాబు కుమారుడు సామ్రాట్ తన తండ్రికి పిండప్రధానం చేసాడు. అనంతరం జయప్రద, సామ్రాట్ కలిసి గోదావరిలో అస్థికలు కలిపారు. ఈ కార్యక్రమం అనంతరం జయప్రద మీడియాతో మాట్లాడింది.

Also Read : Aamir Khan : వాట్.. గత 20 ఏళ్లుగా ఆమీర్ ఖాన్ రెమ్యునరేషన్ తీసుకోవట్లేదా? మరి..?

జయప్రద మాట్లాడుతూ.. రాజబాబు ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. నేను రాజమండ్రికి ఎప్పుడొచ్చినా రాజబాబు తోడుగా వచ్చేవాడు. ఫిబ్రవరి 27న ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. మా జీవితాల నుంచి దూరంగా వెళ్లిపోయినందుకు మాకు చాలా దుఃఖంగా ఉంది. వారి కుమారుడు సామ్రాట్ ని తీసుకువచ్చి ఆయన ఎక్కడ పుట్టాడో అక్కడే అస్తికులు కలపడం జరిగింది. ఈ రోజు ఏడో రోజు రాజమండ్రి ప్రజలు ఈ గోదారమ్మ తల్లి మోక్షాన్ని ప్రసాదించాలని ఆ శివుడు మా తమ్ముడికి మోక్షం కలిగించాలని, మా తమ్ముడు కుమారుడు సామ్రాట్ తో ఈ కార్యక్రమాన్ని చేయించాను అని తెలిపింది.

Also Read : Meenaakshi Chaudhary : బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ఏడ్చేసిన హీరోయిన్.. వీడియో వైరల్..

ఈ కార్యక్రమంలో తమ్ముడికి పిండ ప్రదానం చేస్తుండగా జయప్రద ఎమోషనల్ అయింది. తన అల్లుడు సామ్రాట్ ని పట్టుకొని ఏడ్చింది జయప్రద.