Aamir Khan : వాట్.. గత 20 ఏళ్లుగా ఆమీర్ ఖాన్ రెమ్యునరేషన్ తీసుకోవట్లేదా? మరి..?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమీర్ ఖాన్ తన రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Bollywood Star Aamir Khan Interesting Comments on his Remuneration
Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. హీరోగా సినిమాలు తక్కువ చేస్తూ నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. పలు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తున్నారు. ఆమీర్ ఖాన్ 2022 లో చివరగా లాల్ సింగ్ చద్దా సినిమాతో రాగా ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత హీరోగా మళ్ళీ ఇప్పటిదాకా రాలేదు.
సాధారణంగా స్టార్ హీరోలు అంటే రెమ్యునరేషన్స్ కోట్లల్లో ఉంటుంది. అందులోను బాలీవుడ్ స్టార్ హీరోలు అంటే భారీ రెమ్యునరేషన్స్ ఉంటాయి. సల్మాన్, షారుఖ్ లు కూడా 100 కోట్ల రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అయితే ఆమీర్ ఖాన్ మాత్రం రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు అంట.
Also Read : Meenaakshi Chaudhary : బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ఏడ్చేసిన హీరోయిన్.. వీడియో వైరల్..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమీర్ ఖాన్ తన రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా నేను నా సినిమాలకు రెమ్యునరేషన్స్ తీసుకోవట్లేదు. నేను కేవలం ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటాను. ప్రాఫిట్స్ లో షేరింగ్ తీసుకోవడం బడ్జెట్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా మంచి స్క్రిప్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే నిర్మాతలకు కూడా ఎక్కువ భారం ఉండదు. నా చాలా సినిమాలు 20 కోట్ల లోపుతోనే పూర్తి అయ్యాయి అని అన్నారు.
దీంతో ఆమీర్ ఖాన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇటీవల చాలా మంది హీరోలు సినిమా హిట్ అవుతుంది అని కథ మీద నమ్మకం ఉంటే రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటున్నారు. గతంలో చిరంజీవి అలాగే చేసేవారు. టాలీవుడ్ లో ఆ పద్ధతి చిరంజీవే మొదలు పెట్టారు. ఇప్పుడు చాలా మంది హీరోలు కూడా అదే చేస్తున్నారు. అయితే వాళ్ళు ఒక్కో సినిమాకు ఒక్కోలా డబ్బులు తీసుకుంటున్నారు.
Also Read : Agent : హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత అయ్యగారి సినిమా ఓటీటీలోకి.. ట్రైలర్ కూడా రిలీజ్.. ఎప్పుడు? ఏ ఓటీటీలో?
కానీ ఆమీర్ ఖాన్ మాత్రం 20 ఏళ్లుగా రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటున్నాను అని చెప్పడంతో ఫ్యాన్స్, నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరి ఆమీర్ ఖాన్ ప్రాఫిట్స్ వచ్చిన సినిమాలకే తీసుకున్నాడా? ఫ్లాప్ అయిన సినిమాలకు ఏం చేసాడో అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తన సినిమాల బడ్జెట్ 20 కోట్లే అని చెప్పడంతో మరింత ఆశ్చర్యపోతున్నారు. అసలు అందరి రెమ్యునరేషన్స్ తీసేసినా 20 కోట్లతో బాలీవుడ్ లో సినిమా పూర్తవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఆమీర్ ఖాన్ కూడా నిర్మాత కావడంతో తాను హీరోగా చేసే సినిమాలకు రెమ్యునరేషన్స్ కాకుండా ప్రాఫిట్స్ లో షేర్ తీసుకోవడం మంచి విషయమే అంటున్నారు.