Agent : హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత అయ్యగారి సినిమా ఓటీటీలోకి.. ట్రైలర్ కూడా రిలీజ్.. ఎప్పుడు? ఏ ఓటీటీలో?
ఏజెంట్ సినిమా రిలీజయి రెండేళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు.

Akhil Akkineni Agent Movie Finally Streaming in OTT Details Here
Agent : అఖిల్ అక్కినేని మొదటి సారి ఫుల్ మాస్, యాక్షన్, స్పై రోల్ లో చేసిన సినిమా ‘ఏజెంట్’. అఖిల్, సాక్షి వైద్య జంటగా, మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ముఖ్య పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఏజెంట్ సినిమా 2023 ఏప్రిల్ 28న రిలీజయింది. ఏజెంట్ తో అయినా అఖిల్ భారీ హిట్ కొడతాడు అనుకున్నా అది భారీ పరాజయం పాలయింది.
Also Read : Tamannaah – Vijay Varma : ఇదో కొత్త రకం బ్రేకప్.. తమన్నా – విజయ్ వర్మ రెండేళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పి..
అయితే ఏజెంట్ సినిమా రిలీజయి రెండేళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. పలుమార్లు సోషల్ మీడియాలో దీనిపై చర్చ కూడా జరిగింది. పలుమార్లు ఓటీటీలోకి వస్తుంది అని ప్రకటించి వాయిదా వేశారు. మొదట 2023 మే 19న ఏజెంట్ సినిమా సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామన్నారు, ఆ తర్వాత సెప్టెంబర్ 29 అన్నారు. కానీ అప్పుడు కూడా రాలేదు. సినిమా ఫ్లాప్ అయినా ఓటీటీలోకి వస్తే చూడని వాళ్ళు ఒక్కసారైనా చూస్తారు అని ఫ్యాన్స్, నెటిజన్లు భావిస్తున్నారు.
Also Read : Artiste : ‘ఆర్టిస్ట్’ ట్రైలర్ చూశారా..? ఆర్టిస్ట్ అంటూ దారుణంగా మర్డర్లు..
ఈ క్రమంలో తాజాగా సోని లివ్ ఏజెంట్ సినిమా తమ ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించింది. మార్చ్ 14 నుంచి ఏజెంట్ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో అయ్యగారి ఫ్యాన్స్ హమ్మయ్య ఇప్పటికైనా ఎజెంట్ సినిమా ఓటీటీలోకి వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏజెంట్ సినిమా మార్చ్ 14 నుంచి సోని లివ్ ఓటీటీలో చూసేయండి. దీనికి సంబంధించి కొత్త ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అఖిల్ ఏజెంట్ సినిమా ఓటీటీ ట్రైలర్ చూసేయండి..