Tamannaah – Vijay Varma : ఇదో కొత్త రకం బ్రేకప్.. తమన్నా – విజయ్ వర్మ రెండేళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పి..

దీంతో వీరిద్దరూ కలిసి చేసిన లస్ట్ స్టోరీస్ 2 సినిమా ప్రమోషన్స్ లో వీరి ప్రేమ గురించి బయటపెట్టారు.

Tamannaah – Vijay Varma : ఇదో కొత్త రకం బ్రేకప్.. తమన్నా – విజయ్ వర్మ రెండేళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పి..

Tamannaah Bhatia Vijay Varma will Breakup their Love Rumors goes Viral

Updated On : March 5, 2025 / 5:02 PM IST

Tamannaah Bhatia – Vijay Varma : పెళ్లి అయిన సెలబ్రిటీలు డైవర్స్ తీసుకోవడం, లవ్ లో ఉన్న సెలబ్రిటీలు బ్రేకప్ లు చెప్పుకోవడం ఇటీవల కామన్ అయిపోయింది. తాజాగా హీరోయిన్ తమన్నా – నటుడు విజయ్ వర్మ బ్రేకప్ అయ్యారట. 2005లో తమన్నా హిందీలో ఓ సినిమా చేసి అనంతరం తెలుగులో శ్రీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తుంది.

Also Read : Singer Kalpana : కల్పన ఏమో అలా.. ఆమె కూతురు ఇలా.. సింగర్ కల్పన కేసులో కూతురు ఏం చెప్పింది అంటే..

సినీ పరిశ్రమకు వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా ఇంకా అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ చేతి నిండా సినిమాలతో బిజీగానే ఉంది తమన్నా. గతంలో తమన్నా పై ఎప్పుడూ ఎవరితో అయినా డేటింగ్ లో ఉన్నట్టు, ప్రేమలో ఉన్నట్టు వార్తలు రాలేదు. రెండేళ్ల క్రితం మాత్రం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి, వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు లీక్ అయ్యాయి.

Tamannaah Bhatia Vijay Varma will Breakup their Love Rumors goes Viral

దీంతో వీరిద్దరూ కలిసి చేసిన లస్ట్ స్టోరీస్ 2 సినిమా ప్రమోషన్స్ లో వీరి ప్రేమ గురించి బయటపెట్టారు. అప్పట్నుంచి ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పడం, వీరి ప్రేమ గురించి చెప్పడం, ఒకర్నొకరు పొగడటం చేశారు. కొన్ని రోజుల క్రితం వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు కూడా వచ్చాయి. కానీ తాజాగా నిన్నటి నుంచి తమన్నా – విజయ వర్మ విడిపోతున్నారు అని వార్తలు వస్తున్నాయి.

Also Read : Santhana Prapthirasthu Teaser : ‘సంతాన ప్రాప్తిర‌స్తు’ టీజ‌ర్ వ‌చ్చేసింది.. భార్య‌ను ప్రెగ్నెంట్ చేసేందుకు..

అయితే కొత్తరకం బ్రేకప్ చెపుకున్నారని బాలీవుడ్ లో వినిపిస్తుంది. వీరిద్దరూ ప్రేమలో పరస్పర అంగీకారంతోనే బ్రేకప్ చెప్పుకున్నారని, కానీ ఇకపై మంచి ఫ్రెండ్స్ గా కొనసాగాలని అనుకున్నట్టు, రొమాంటిక్ రిలేషన్ షిప్ కి బ్రేకప్ చెప్పుకున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకరంటే ఒకరికి ఇష్టం, గౌరవం ఉంది అందుకే లవ్ లో విడిపోయి ఫ్రెండ్స్ గా ఉండాలనుకుంటున్నారట. అయితే వీళ్ళు ఎందుకు విడిపోతున్నారు?అసలు విడిపోతున్నారా? ఒక వేళ బ్రేకప్ అయితే ఈ ఫ్రెండ్షిప్ ఏంటో అని అభిమానులు చర్చించుకుంటున్నారు. దీనిపై తమన్నా – విజయ్ వర్మ మాత్రం ఇంకా స్పందించలేదు. ఇక తమన్నా త్వరలో ఓదెల 2 సినిమాతో రానుంది. ఇందులో లేడీ అఘోరాగా తమన్నా కనిపించనుంది.