Samantha : సమంత ఫస్ట్ సినిమా ‘ఏ మాయ చేసావే’ కాదా? ఆ హీరోతో..? ఆ హీరో సమంతకు బెస్ట్ ఫ్రెండ్ తెలుసా..?

సమంత ఓకే చేసి మొదట నటించిన సినిమా వేరు.

Samantha : సమంత ఫస్ట్ సినిమా ‘ఏ మాయ చేసావే’ కాదా? ఆ హీరోతో..? ఆ హీరో సమంతకు బెస్ట్ ఫ్రెండ్ తెలుసా..?

Do You Know Samantha First Movie its not Ye Maya Chesave

Updated On : March 5, 2025 / 8:18 PM IST

Samantha : సమంత ఫస్ట్ సినిమా అంటే అందరూ ఏ మాయ చేసావే అనే చెప్తారు. నాగ చైతన్య, సమంత జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఏ మాయ చేసావే సినిమా 2010లో రిలీజయి పెద్ద హిట్ అయింది. అప్పట్నుంచే నాగ చైతన్య – సమంత స్నేహం మొదలైంది. అయితే ఏ మాయ చేసావే సినిమా సమంతకు మొదట రిలీజ్ అయిన సినిమా.

కానీ సమంత ఓకే చేసి మొదట నటించిన సినిమా వేరు. సమంతకు మొదట తమిళ్ లో ఓ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా పేరు మాస్కోవిన్ కావేరి. రాహుల్ రవీంద్రన్ హీరోగా సమంత హీరోయిన్ గా ఈ సినిమా మొదలయింది. అయితే పలు కారణాలతో కొన్ని రోజులు షూటింగ్ జరిగి సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత సమంతకు ఏ మాయ చేసావే ఛాన్స్ రావడంతో ఆ సినిమా షూట్ కి వెళ్ళిపోయింది.

Also Read : Aamir Khan : వాట్.. గత 20 ఏళ్లుగా ఆమీర్ ఖాన్ రెమ్యునరేషన్ తీసుకోవట్లేదా? మరి..?

ఏ మాయ చేసావే సినిమా షూట్ జరుగుతున్న సమయంలో మళ్ళీ మాస్కోవిన్ కావేరి మొదలైంది. అయితే ఏ మాయ చేసావే సినిమా ముందే పూర్తయి 2010 ఫిబ్రవరిలో రిలీజయింది. ఆ తర్వాత మాస్కోవిన్ కావేరి 2010 ఆగస్టులో రిలీజయింది. అలా సమంత మొదట రాహుల్ రవీంద్రన్ తో మాస్కోవిన్ కావేరి సినిమా ఓకే చేసినా నాగ చైతన్యతో చేసిన ఏ మాయ చేసావే సినిమా ముందు రిలీజయింది.

Do You Know Samantha First Movie its not Ye Maya Chesave

Also Read : Meenaakshi Chaudhary : బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ఏడ్చేసిన హీరోయిన్.. వీడియో వైరల్..

ఇక రాహుల్ రవీంద్రన్ – సమంత బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. అనేక సార్లు వీరిద్దరూ పలు ఇంటర్వ్యూలలో, పలు స్టేజీలపై ఈ మాట చెప్పారు. తన మొదటి సినిమా రాహుల్ రవీంద్రన్ తో కావడంతో అప్పట్నుంచి వీరికి పరిచయం ఉంది. ఇక రాహుల్ తర్వాత నటుడిగా, దర్శకుడిగా కూడా మారాడు. సమంత ఇటీవలే నటిగా 15 ఏళ్ళ ప్రయాణం పూర్తి చేసుకుంది.