Censor Board: సెన్సార్ బోర్డు సభ్యుడిగా రియల్ స్టార్ శ్రీహరి తమ్ముడు.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..

గత వారం రోజులుగా టాలీవుడ్ లో పలువురు ప్రముఖులకు కీలక పదవులు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు. తాజాగా టాలీవుడ్ రియల్ స్టార్ దివంగత శ్రీహరి తమ్ముడిని సెన్సార్ బోర్డు సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వూలు జారీచేసింది కేంద్ర ప్రభుత్వం.

Real star Srihari's brother as member of censor board

Censor Board: గత వారం రోజులుగా టాలీవుడ్ లో పలువురు ప్రముఖులకు కీలక పదవులు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు. నటుడు పోసాని కృష్ణ మురళిని ‘ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా’ నియమిస్తూ నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్.. ఇటీవలే కమెడియన్ అలీకి కూడా ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడి పదవిని అప్పగించారు.

Kamal-Chiru: కమల్ హాసన్ సూపర్ హిట్ మూవీ ‘విక్రమ్’ చిరంజీవి ప్లాప్ మూవీ ‘ఆచార్య’ రికార్డుని దాటలేకపోయింది..

తాజాగా టాలీవుడ్ రియల్ స్టార్ దివంగత శ్రీహరి తమ్ముడిని సెన్సార్ బోర్డు సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వూలు జారీచేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రాంతీయ సెన్సార్ బోర్డు (సెంట్రల్ బోర్డు అఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) హైదరాబాద్ రీజియన్ సభ్యుడిగా ఆర్.శ్రీధర్ ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. రియల్ స్టార్ శ్రీహరి తమ్ముడైన శ్రీధర్ నటుడిగా వంద సినిమాలకు పైగా చేయడంతో పాటు నిర్మాతగా కూడా సినిమాలు చేశారు.

రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ స్పందిస్తూ తనకు లభించిన ఈ పదవికి పూర్తి న్యాయం చేకూరుస్తానని పేర్కొంటూ, కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గారికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, కేంద్ర సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ కు, తెలంగాణ రాష్ట్ర బి.జె.పి. ప్రెసిడెంట్ బండి సంజయ్ గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు, నిర్మాతలు నట్టి కుమార్, జె.వి.మోహన్ గౌడ్ తదితరులు శ్రీధర్ కు శుభాకాంక్షలు తెలిపారు.