రెండు క్యారెక్టర్స్‌లో రామ్ – థ్రిల్ కలిగిస్తున్న ‘రెడ్’ టీజర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న మాస్ థ్రిల్లర్ ‘రెడ్’ టీజర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : February 28, 2020 / 11:58 AM IST
రెండు క్యారెక్టర్స్‌లో రామ్ – థ్రిల్ కలిగిస్తున్న ‘రెడ్’ టీజర్

Updated On : February 28, 2020 / 11:58 AM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న మాస్ థ్రిల్లర్ ‘రెడ్’ టీజర్ రిలీజ్..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న థ్రిల్లర్.. ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా నివేదా పేతురాజ్, మాళవిక శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు.

This is not your regular Crime Thriller, This is a #MassThriller అంటూ  శుక్రవారం సాయంత్రం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ‘క్రైమ్ హిస్టరీలో ఇలాంటి కేస్ చూడడం ఇదే ఫస్ట్ టైమ్’ అనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఆసక్తి కరంగా సాగిపోయింది. ‘సిద్ధార్థ్, ఆదిత్య.. ఇద్దరికీ ఎటువంటి సంబధం లేదు.. డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్స్.. డిఫరెంట్ డిఫరెంట్ వరల్డ్స్’.. అంటూ రామ్ చేస్తున్న రెండు పాత్రలను ఉద్దేశించి చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.

‘వాంటెడ్‌గా నన్ను ఇందులో ఇరికించాలని చూస్తున్నాడు. ఎందుకంటే లైఫ్‌లో వాడికున్న వన్ అండ్ ఓన్లీ ఆబ్సేషన్.. నేనే’’.. అంటూ రామ్ చెప్పిన డైలాగ్‌తో టీజర్ ఎండ్ అవుతోంది. రామ్ గెటప్, బాడీ లాంగ్వేజ్, సమీర్ రెడ్డి విజువల్స్, మణిశర్మ ఆర్ఆర్ టీజర్‌లో హైలెట్ అయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 9న ‘రెడ్’ విడుదల కానుంది.