Telugu States Politics: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అసలేం జరుగుతోంది? ఒకరి గెలుపు మరొకరికి ఎందుకు ఆనందాన్ని ఇస్తున్నట్లు?
జగన్ కార్యక్రమాల ప్లెక్సీల్లో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో వైఎస్ జగన్ ప్లెక్సీలు, వైసీపీ జెండాలు కనిపించడంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అసలేం జరుగుతోందన్నది హాట్ టాపిక్‌గా మారింది.
- చంద్రబాబు, రేవంత్ దోస్తీ అంటూ బీఆర్ఎస్ అటాక్
- బీఆర్ఎస్, వైసీపీ కుమ్మక్కు అంటూ కాంగ్రెస్ ఆరోపణ
- కేటీఆర్ ఖమ్మం టూర్‌లో వైసీపీ జెండాలు, జగన్ స్లోగన్స్
- జగన్ బర్త్ డే సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో ప్లెక్సీలు
- ఆ నాలుగు పార్టీలు, నలుగురు నేతల బంధంపై చర్చ
Telugu States Politics: పార్టీలు వేరు. ప్రాంతాలు వేరు. కానీ ఆ పార్టీ ఈ పార్టీతో దోస్తీ..ఈ పార్టీ ఆ పార్టీతో దోస్తీ.. ఇదే ఇప్పుడు తెలంగాణలో ట్రెండింగ్ టాపిక్. ఏపీ సీఎం, తెలంగాణ సీఎం దోస్త్‌లు అంటూ బీఆర్ఎస్, వైసీపీ ప్రచారం చేస్తున్నాయ్. వైసీపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ నేతలు, టీడీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా లీడర్ల టూర్లలో కనిపిస్తున్న జెండాలు, ఫ్లెక్సీలు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయి. అసలు తెలంగాణ పాలిటిక్స్‌లో ఏం జరుగుతోంది? ఎవరి మద్దతు ఎవరికి ఉంది? ఒకరి గెలుపు మరొకరికి ఎందుకు ఆనందాన్ని ఇస్తున్నట్లు.?
అక్కడ వాళ్లు గెలిస్తే..ఇక్కడ వీళ్లకు ఆనందం. ఇక్కడ వీళ్లు గెలిస్తే అక్కడ వాళ్లకు ఆనందం. అవును ఇది తెలంగాణ సెంట్రిక్‌గా జరుగుతోన్న సరికొత్త చర్చ. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఉండాలని..ఏపీలో టీడీపీ క్యాడర్ కోరుకుంటుందని..ఏపీలో టీడీపీ అధికారంలో ఉండాలని రేవంత్ అభిమానులు కోరుకుంటారనే ఓ వాదన. ఇదే క్రమంలో చంద్రబాబు, రేవంత్ చీకటి ఒప్పందాలు..లోపాయికారి సంబంధాలు అంటూ బీఆర్ఎస్ ఎప్పటికప్పుడూ అటాక్ చేస్తూనే ఉంటుంది.
దుష్మన్ కా దుష్మన్ అప్నా దోస్త్..!
లేటెస్ట్‌గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయి. వైసీపీ క్యాడర్..తెలంగాణలో కేసీఆర్ గెలవాలని కోరుకుంటారని.. బీఆర్ఎస్ క్యాడర్ ఏపీలో జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటారని చెప్పారు. దీనికి ఆయన ఒక ఈక్వేషన్ కూడా చెప్పి చర్చకు దారి తీశారు. అదే దుష్మన్ కా దుష్మన్ అప్నా దోస్త్ అనే పాయింట్ తప్ప..వేరే కారణాలు ఏమి ఉండవంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి తెలంగాణలో రేవంత్ సీఎం అయినప్పుడు కాంగ్రెస్ ర్యాలీల్లో ..రేవంత్ ఇంటి దగ్గర టీడీపీ జెండాలు కనిపించాయి. మరోవైపు జగన్ పర్యటనల్లో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు కనిపించడం కూడా పొలిటికల్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
లేటెస్ట్‌గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనలో..వైసీపీ జెండాలు కనిపించాయి. కేటీఆర్ ర్యాలీలో వైసీపీ ఫ్లాగ్స్‌తో, జగన్ నినాదాలతో సందడి చేశారు ఫ్యాన్ పార్టీ అభిమానులు. ఖమ్మం జిల్లాలో వైసీపీకి పట్టుంది. టీడీపీకి కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా మంచి బలమే ఉంది. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఇటు కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న నేతలు..అటు బీఆర్ఎస్‌లో కీలకంగా ఉన్న నేతలు వైసీపీ, టీడీపీ నుంచి వచ్చిన వారే. 2014లో ఖమ్మంలో మూడు ఎమ్మెల్యేలు సహా, ఒక ఎంపీ సీటును గెలుచుకుంది వైసీపీ. టీడీపీ కూడా ఖమ్మంలో ఒక సీటును, 2018లో రెండు సీట్లను గెలుచుకుంది. సీట్ల పరంగానే కాదు..వైసీపీ, టీడీపీ అభిమానులు కూడా ఖమ్మం జిల్లాలో డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు.
కేటీఆర్ ఖమ్మం పర్యటనలో వైసీపీ ఫ్లాగ్స్..
అయితే రేవంత్ ఆల్రెడీ చంద్రబాబుతో కలిసి పని చేసిన నేతగా..వాళ్లిద్దరూ ఒక్కటే అన్న భావనతో..గత ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఔట్‌రైట్‌గా కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసిందన్న ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్న వేళ కేటీఆర్ ఖమ్మం పర్యటనలో వైసీపీ ఫ్లాగ్స్ కనిపించడం చర్చకు దారితీస్తోంది. ఖమ్మంలో వైసీపీ క్యాడర్, జగన్ అభిమానులు బీఆర్ఎస్ వెంట మద్దతుగా నిలిస్తే..పోటీ మరోలా ఉంటుందన్న అంచనాలున్నాయి.
జగన్ కార్యక్రమాల ప్లెక్సీల్లో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు..
అటు ఏపీ మాజీ సీఎం జగన్ కార్యక్రమాల ప్లెక్సీల్లో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో వైఎస్ జగన్ ప్లెక్సీలు, వైసీపీ జెండాలు కనిపించడంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అసలేం జరుగుతోందన్నది హాట్ టాపిక్‌గా మారింది. గతేడాది నవంబర్‌లో వైఎస్ జగన్ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు వచ్చిన సందర్భంగా అభిమానులు ఆయనకు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీబీఐ కోర్టు దగ్గర ఓ అభిమాని ప్రదర్శించిన ఫ్లెక్సీలో జగన్‌తో పాటు కేటీఆర్ ఫోటోను ఉంచారు. జగన్ కోర్టు నుంచి లోటస్ పాండ్ కు వెళ్లే క్రమంలో వైసీపీ జెండాలతో పాటు అక్కడక్కడ బీఆర్ఎస్ జెండాలు కూడా కనిపించాయి.
జగన్ పుట్టిన రోజు కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. జగన్ బర్త్ డే సందర్భంగా తాడేపల్లిలో కేసీఆర్, కేటీఆర్, జగన్‌తో కూడిన ఫ్లెక్సీ వెలిసింది. అది కూడా రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపింది. ఇక ఇటు తెలంగాణ సీఎం రేవంత్..అటు ఏపీ సీఎం చంద్రబాబు దోస్తీ అనే ప్రచారం ఓవైపు..జగన్, కేసీఆర్ మిత్రులంటూ కాంగ్రెస్ విమర్శలు రెగ్యులర్ అయిపోయాయి. ఇలా తెలంగాణ సెంట్రిక్‌గా టీడీపీ వర్సెస్ వైసీపీ..బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయం…నెక్స్ట్ లెవల్ హీట్‌ను క్రియేట్ చేస్తోంది.
Also Read: ఐదుగురు మంత్రులకు పదవీ గండం..! ఆ ఐదుగురు ఎవరు? వారి ప్లేస్‌లో చోటు దక్కేదెవరికి?
