×
Ad

Bad Girlz : ‘బ్యాడ్ గాళ్స్’ ట్రైలర్ రిలీజ్.. నలుగురు బ్యాడ్ గర్ల్స్ కథ..

మీరు కూడా బ్యాడ్ గాళ్స్ ట్రైలర్ చూసేయండి.. (Bad Girlz)

Bad Girlz

Bad Girlz : అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘బ్యాడ్ గాళ్స్’. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మాణంలో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా ఫేమ్ డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Bad Girlz)

క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ అవ్వగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ రాజాసాబ్ దర్శకుడు మారుతి చేతుల మేడేనుగా రిలీజ్ చేసారు. మీరు కూడా బ్యాడ్ గాళ్స్ ట్రైలర్ చూసేయండి..

Also Read : Duvvada Srinivas : బిగ్ బాస్ లో రమ్యకు అన్యాయం జరిగింది.. అనవసరమైన వాళ్ళు ఫైనల్ కి వచ్చారు.. దువ్వాడ కామెంట్స్ వైరల్..

ట్రైలర్ రిలీజ్ అనంతరం మారుతి మాట్లాడుతూ.. డైరెక్టర్ ఫణి ప్రదీప్ నా చిరకాల మిత్రుడు. సాధు జీవి, మంచి సంగీత జ్ఞానం ఉన్నవాడు. తన మొదటి సినిమాలో నీలి నీలి ఆకాశం పాట ఎంత పెద్ద హిట్ అయిందో ఇప్పుడు బ్యాడ్ గాళ్స్చి సినిమా అంతే పెద్ద హిట్ అవుతుంది. ఒక ఐదుగురు కొత్త అమ్మాయిలతో ఒక మంచి విషయం చెప్పే సినిమా చేసాడు. ఇప్పుడు ఆడపిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమా ఇది అన్నారు.