Duvvada Srinivas : బిగ్ బాస్ లో రమ్యకు అన్యాయం జరిగింది.. అనవసరమైన వాళ్ళు ఫైనల్ కి వచ్చారు.. దువ్వాడ కామెంట్స్ వైరల్..
వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆరుగురు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి వాళ్లంతా కూడా త్వరగానే వెళ్లిపోయారు. (Duvvada Srinivas)
Duvvada Srinivas
Duvvada Srinivas : బిగ్ బాస్ సీజన్ 9 పూర్తయింది. కళ్యాణ్ పడాలా ఈ సీజన్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ అయిపోవడంతో ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్, వాళ్లకు సంబంధించిన వ్యక్తులు బయట ఇంటర్వ్యూలు ఇస్తూ వారి వారి అభిప్రాయాలు చెప్తున్నారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ రమ్య మోక్షపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.(Duvvada Srinivas)
వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆరుగురు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి వాళ్లంతా కూడా త్వరగానే వెళ్లిపోయారు. వారిలో రమ్య మోక్ష ఒకరు. సోషల్ మీడియాలో హాట్ హాట్ డ్యాన్సులు, ఫొటోలతో పాటు పచ్చళ్ళ బిజినెస్ తో వైరల్ అయిన రమ్య మోక్ష బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు తో ఎంట్రీ ఇచ్చి రెండు వారాలకే వెళ్ళిపోయింది. తాజాగా బిగ్ బాస్ ఫైనల్ తర్వాత రమ్య మోక్ష, వాళ్ళ అక్క కలిసి దువ్వాడ శ్రీనివాస్ తో పాటు మరో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ దివ్వెల మాధురితో చిన్న చిట్ చాట్ చేసారు.
Also Read : Mamitha Baiju: అందుకే నా పెళ్లి డిసైడ్ చేసేది ఆయనే.. మమిత షాకింగ్ కామెంట్స్
ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస మాట్లాడుతూ.. రమ్య త్వరగా బయటకు రావడం నేను చాలా బాధపడ్డా. అసలు రమ్య టాప్ 5లోకి వెళ్తుందో లేదో తెలీదు కానీ చివరి వరకు ఉండాల్సింది. అనవసరమైన వాళ్లంతా ఫైనల్ వచ్చి కూర్చున్నారు. చాలా కష్టపడి పైకొచ్చిన అమ్మాయి రమ్య. తన కథ ప్రజలందరికి తెలుసు. ఈ అమ్మాయి గెలిస్తే బాగుంటుంది కదా అనుకున్నాం. రమ్యకు అన్యాయం జరిగిందనే నేను అనుకుంటున్నా.
రమ్య, వాళ్ళ సిస్టర్స్ కష్టపడి పైకొచ్చారు. పికిల్స్ అమ్ముకొని, చాకోలెట్స్ అమ్ముకొని, చీరలు అమ్ముకొని.. పైకొచ్చారు. వీళ్ళను చూసి అందరూ నేర్చుకోవాలి ఎలా బతకాలి అని. సూసైడ్ చేసుకునే అందరూ ఈ అక్క చెల్లెళ్లను చూసి నేర్చుకోవాలి. మిమ్మల్ని తిట్టారని కూడా అన్నారు. కానీ మీపై ఎన్ని ట్రోల్స్ వస్తే మీరు అంత ఫైర్ అవుతారు. మీరు చేసింది కరెక్ట్ అని అన్నారు. దివ్వెల మాధురి కూడా.. నేను కూడా అదే అనుకుంటున్నా. రమ్యకు అన్యాయం జరిగింది. ఈ ముగ్గురు సిస్టర్స్ చాలా మందికి ప్రేరణ అని తెలిపింది.
