Mamitha Baiju: అందుకే నా పెళ్లి డిసైడ్ చేసేది ఆయనే.. మమిత షాకింగ్ కామెంట్స్

ప్రేమలు సినిమాతో యూత్ లో యమ క్రేజ్ సంపాదించుకుంది మలయాళ కుట్టి మమిత బైజు(Mamitha Baiju). ఈ ఒక్క సినిమాతో ఆమె చాలా మందికి క్రష్ గా మారిపోయింది.

Mamitha Baiju: అందుకే నా పెళ్లి డిసైడ్ చేసేది ఆయనే.. మమిత షాకింగ్ కామెంట్స్

Mamitha Baiju made interesting comments about marriage.

Updated On : December 23, 2025 / 8:49 AM IST

Mamitha Baiju: ప్రేమలు సినిమాతో యూత్ లో యమ క్రేజ్ సంపాదించుకుంది మలయాళ కుట్టి మమిత బైజు(Mamitha Baiju). ఈ ఒక్క సినిమాతో ఆమె చాలా మందికి క్రష్ గా మారిపోయింది. అంతేకాదు, అదే రేంజ్ లో ఆమెకు లవ్ ప్రపోజల్స్ కూడా వచ్చాయట. తాజాగా తనకు వచ్చిన లవ్ ప్రపోజల్స్ గురించి, తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది మమిత. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు మాట్లాడుతూ.. ‘ప్రేమలు సినిమా తర్వాత నాకు చాలా ప్రపోజల్స్‌ వచ్చాయి. సోషల్ మీడియాలో కాదు.. కొంతమంది నా నంబర్‌ తెలుసుకొని డైరెక్ట్‌గా మెసేజెస్ చేస్తున్నారు. నాకు వాటిని చదివే టైమ్‌, ఓపిక లేదు. అందుకే ఆ వ్యవహారాన్నీ మా అన్నయ్య చూసుకుంటున్నాడు.

Battle Of Galwan: తెలంగాణ వీర సైనికుడిగా సల్మాన్ ఖాన్.. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టీజర్ అప్డేట్..

పేరు మిథున్‌. మేం క్లోజ్‌ ఫ్రెండ్స్‌లా ఉంటాం. నా ప్రతి విషయంలో మా అన్నయ్య ఇన్వాల్వ్‌మెంట్‌ ఉంటుంది. ఏ నిర్ణయమైనా అన్నయ్యను అడిగే తీసుకుంటాను. చివరకు నా పెళ్లి కూడా గురించి కూడా” అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది మమిత. ఇక సినిమాల విషయానికి వస్తే, ఇటీవల ఆమె హీరోయిన్ గా వచ్చిన సినిమా డ్యూడ్. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా తరువాత మమిత చేస్తున్న మరో భారీ సినిమా జన నయగాన్. విజయ్ తలపతి హీరోగా వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మమిత విజయ్ తలపతి కూతురిగా కనిపించనుంది అని టాక్.