Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా ఎంట్రీ పై నెటిజెన్ విమర్శ.. రేణూదేశాయ్ కౌంటర్..

అకీరా నందన్ ఎంట్రీ పై ఒక నెటిజెన్ చేసిన విమర్శకి రేణూదేశాయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు ఏ విషయంలో నెటిజెన్..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా ఎంట్రీ పై నెటిజెన్ విమర్శ.. రేణూదేశాయ్ కౌంటర్..

Renu Desai counter to netizen comment on Akira Nandan entry

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ (Akira Nandan) సినీ ఎంట్రీ గురించి రెండు రోజులు నుంచి నెట్టింట తెగ చర్చ జరుగుతుంది. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు (K Raghavendra Rao) అకీరా గురించి చేసిన ఒక పోస్ట్ తో ఈ చర్చ మొదలయింది. యూఎస్ లోని ఫిలిం స్కూల్ లో అకీరా యాక్టింగ్ కోర్స్ తీసుకోబోతున్నాడు అంటూ రాఘవేంద్రరావు తెలియజేశాడు. అయితే ఇంతలోనే రాఘవేంద్రరావు ఆ పోస్ట్ ని డెలీట్ చేయడం, ఆ తరువాత రేణూ దేశాయ్ (Renu Desai).. అకీరాకి యాక్టింగ్ పై ప్రస్తుతం ఇంటరెస్ట్ లేదు అని చెబుతూ పోస్ట్ వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Varun Tej : అల్లు అర్జున్, రామ్ చరణ్‌ల పెళ్లి తరువాత.. ఎవరిలో ఎక్కువ మార్పు వచ్చింది.. వరుణ్ తేజ్ ఆన్సర్!

ఇది ఇలా ఉంటే, తాజాగా ఒక నెటిజెన్ అకీరా నందన్ ఎంట్రీ పై విమర్శ చేస్తూ ఒక కామెంట్ చేశాడు. “ఫిలిం స్కూల్స్ లో వందలాది మంది నటన నేర్చుకుంటారు. గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడతారు. కానీ ఒక స్టార్ వారసుడిగా ఎలాంటి కష్టం లేకుండా హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటారు” అని ఒక నెటిజెన్ ప్రశ్నించాడు. దీనికి రేణూదేశాయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

Renu Desai : ఒక్క రోజులోనే పవన్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లిన రేణూదేశాయ్.. అకీరా హీరో ఎంట్రీ లేనట్లేనా..?

రేణూదేశాయ్ సమాధానం..
“మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. అంబానీ తన కంపెనీని తన కొడుకు, కూతురికి కాకుండా బయట వాళ్ళకి ఇవ్వడం సమంజసమే అంటారా? అవును వారసులుగా హీరో, నిర్మాత, డైరెక్టర్ పిల్లలు ఈజీగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఆ ఎంట్రీ చాలా ఈజీనే, కానీ వారి పేరెంట్స్ లెగసీని ముందుకు తీసుకు వెళ్లకపోయినా, నటుడిగా వాళ్ళని నిరూపించుకోవడంలో ఫెయిల్ అయినా.. ఏమాత్రం జాలి లేకుండా చాలా దారుణంగా మీరే ట్రోల్ చేస్తారు.

అలా స్టార్స్ వారసులుగా కాకుండా, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వారి ఫెయిల్యూర్ ని ఎవరు పట్టించుకోరు. ఒకవేళ వాళ్ళు సక్సెస్ అయితే రజినీకాంత్, మాధురీ దీక్షిత్ వంటి స్టార్స్ అవుతారు. ఇక్కడ హీరో వారసుడు అనేది ముఖ్యం కాదు. మీలోని టాలెంట్ ఇంపార్టెంట్. కాబట్టి మీలో ఉన్న టాలెంట్ పై ఫోకస్ పెట్టి, దానిని బయట పెట్టే ప్రయత్నం చెయ్యండి” అంటూ పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)