Renu Desai : ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో రేణూదేశాయ్ పాత్ర చూసి.. ఆద్య ఏమి చెప్పిందో తెలుసా..?
'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలోని హేమలత పాత్రని ఎంపిక చేసుకున్నందుకు రేణూదేశాయ్ కూతురు 'ఆద్య' ఏమని ప్రశంస ఇచ్చిందో తెలుసా..?

Renu Desai daughter about Hemalatha Lavanam role in Tiger Nageswara Rao
Renu Desai : ఒకప్పటి హీరోయిన్ రేణూదేశాయ్ చాలా గ్యాప్ తరువాత మళ్ళీ నటించబోతుంది. రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తూ స్క్రీన్ పై ఆడియన్స్ కి కనిపించబోతుంది. ఈ మూవీలో రేణూదేశాయ్.. ‘హేమలత లవణం’ అనే పాత్రని చేస్తుంది. ఈ పాత్ర రేణూదేశాయ్ ప్రస్తుత ఏజ్ కి తగ్గట్టు ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న రేణూదేశాయ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది.
ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాలోని హేమలత పాత్రని ఎంపిక చేసుకున్నందుకు తన కూతురు ‘ఆద్య’ ఏమని ప్రశంస ఇచ్చిందో చెప్పుకొచ్చింది. ఆద్య చెప్పిన మాటలు.. “చాలామంది నటులు వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు పాత్రలు చేయరు. కానీ నువ్వు ఈ సినిమాలో నీ ఏజ్ కి తగ్గ పాత్రని చేస్తున్నావు. అందుకు నాకు గౌరవంగా ఉంది అమ్మ నిన్ను చూస్తుంటే” అని చెప్పింది. ఆ మాటలు రేణూదేశాయ్ కి చాలా సంతోషాన్ని ఇచ్చినట్లు వెల్లడించింది.
Also read : Dunki : షారుఖ్ ఖాన్ ‘డంకీ’ పోస్టుపోన్ అవుతుందా..? ప్రభాస్ సలార్‌తో పోటీకి రావడం లేదా..?
కాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కుతుంది. దీంతో ఈ సినిమాలో నిజ జీవిత పాత్రలు కూడా కనిపించబోతున్నాయి. ఈక్రమంలోనే రేణూదేశాయ్ పోషించే హేమలత పాత్ర కూడా నిజం జీవితంలోనిదే. లెజెండరీ రచయిత ‘గుర్రం జాషువా’ కూతురు, సంఘసంస్కర్త, రచయిత అయిన ‘హేమలత లవణం’ పాత్రని రేణూదేశాయ్ పోషిస్తుంది.
19వ కాలంలో నేరాలకు పాల్పడే నేరస్థుల్లో పరివర్తన తీసుకు వచ్చేందుకు హేమలత లవణం ఎంతో శ్రమించారు. ఈక్రమంలోనే టైగర్ నాగేశ్వరరావుని కూడా ఆమె కలుసుకున్నట్లు తెలుస్తుంది. ఆ సన్నివేశాలని ఈ సినిమాలో చూపించబోతున్నారు. కొత్త దర్శకుడు వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.