Dunki : షారుఖ్ ఖాన్ ‘డంకీ’ పోస్టుపోన్ అవుతుందా..? ప్రభాస్ సలార్‌తో పోటీకి రావడం లేదా..?
ప్రభాస్ సలార్‌తో పోటీ నుంచి షారుఖ్ ఖాన్ 'డంకీ' వెనక్కి వెళ్తుందా..? పోస్టుపోన్ వార్తల్లో నిజమెంత..?

Shah Rukh Khan Dunki movie postpone news true update
Dunki : బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘డంకీ’. ఈ మూవీ పై ఆడియన్స్ లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. క్రిస్టమస్ కానుకగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అదే సమయంలో ప్రభాస్ ‘సలార్’ కూడా రిలీజ్ అవుతుండడంతో.. ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ రేస్ నుంచి షారుఖ్ వెనక్కి తగ్గుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ మూవీ పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ కి ఇంకా సమయం పడుతుందని, ఈక్రమంలోనే మూవీ పోస్టుపోన్ అవ్వబోతుందని వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో సలార్ తో పోటీ నుంచి డంకీ తప్పుకుందని వార్తలు రావడం మొదలయ్యి. ఇక ఈ వార్తలు బి-టౌన్ లో హాట్ టాపిక్ అయ్యాయి. నిజంగానే షారుఖ్ వెనక్కి తగ్గుతున్నాడా అని చర్చ మొదలైంది. షారుఖ్ అభిమానుల్లో కూడా ఆందోళన స్టార్ట్ అయ్యింది. దీంతో బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్.. మూవీ టీం నుంచి ఒక క్లారిటీ తీసుకోని పోస్టుపోన్ పై రియాక్ట్ అవుతూ ట్వీట్ వేశాడు.
డంకీ పోస్టుపోన్ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, మేకర్స్ చెప్పినట్లు క్రిస్టమస్‌కే ఈ సినిమా రాబోతుందంటూ తెలియజేశాడు. అలాగే మూవీ టీజర్ ని కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నారని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ తో షారుఖ్ అభిమానులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. షారుఖ్ ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు హిట్స్ ని అందుకున్నాడు. ఇప్పుడు డంకీతో కూడా హిట్ అందుకొని హ్యాట్రిక్ సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. కాగా ఈ మూవీ మలయాళ హిట్ మూవీ ‘కామ్రేడ్ ఇన్ అమెరికా’కి ఫ్రీమేక్ గా వస్తుందని టాక్ వినిపిస్తుంది.
SRK – ‘DUNKI’ NOT POSTPONED… Yes, #Dunki is arriving on #Christmas2023… #DunkiTeaser releasing soon! #SRK #RajkumarHirani pic.twitter.com/kDShzPoRTu
— taran adarsh (@taran_adarsh) October 13, 2023