Renu Desai : కొంతమంది మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు.. రేణుదేశాయ్ పోస్ట్ పవన్ గురించా?

రేణుదేశాయ్ (Renu Desai) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.ఇక అది చూసిన నెటిజెన్లు.. ఆ పోస్ట్ పవన్ కళ్యాణ్ ని (Pawan Kalyan) ఉద్దేశించిందే అని అభిప్రాయ పడుతున్నారు.

Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రేణుదేశాయ్ (Renu Desai) పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి బద్రి (Badri) సినిమాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2009 జనవరి 28న ప్రేమ బంధంతో ఒకటయ్యారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే విబేధాలు రావడంతో 2012 లో విడాకులు తీసుకోని విడిపోయారు. అప్పటి నుంచి రేణుదేశాయ్ తన పిల్లలను చూసుకుంటూ జీవిస్తుంది. ప్రస్తుతం నిర్మాతగా, నటిగా మళ్ళీ సినీ రంగంలో బిజీ అవుతుంది. కాగా రేణుదేశాయ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.

Upasana : సమాజం కోరుకున్నప్పుడు కాదు నేను కావాలనుకున్నప్పుడు తల్లినవుతున్నాను..

ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. కొంతమంది మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు. వేడి వేసవిలో చల్లని వసంత గాలిలా.. ”వారి చూపులతోనే నేరుగా మీ హృదయంతో మాట్లాడుతారు. అది మనసుకి మాత్రమే తెలిసిన రహస్య భాష. మీరు వారితో కొన్ని గంటలు గడిపినప్పటికీ, వారి జ్ఞాపకాలు మాత్రం మీతో శాశ్వతంగా ఉండిపోతాయి. అయితే ఆ జ్ఞాపకాలు కొన్నిసార్లు బాధను కూడా కలిగించవచ్చు. కానీ కొంతమంది మాత్రం మీ కన్నీళ్లు తుడిచి ధైర్యాన్ని పంచుతారు. అలాగే నవ్వులు పరిచయం చేస్తారు” అంటూ ఒక వీడియో పోస్ట్ కింద ఇదంతా రాసుకొచ్చింది.

Sukumar: శిష్యుడి సినిమాపై గురువు కామెంట్.. సంతోషంతో పాటు గర్వంగా ఉందన్న సుకుమార్!

అలాగే ఆ వీడియోలో నేను నిన్ను నా కలల్లో, నిజంలో ఎప్పటికి ఉంచుకుంటాను అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలు పవన్ ని ఉద్దేశించి చేసిందా? అని అభిప్రాయ పడుతున్నారు పవన్ అభిమానులు. ఎందుకంటే వీరిద్దరి మొదటి కలయిక కారణమైన బద్రి సినిమా 23 ఏళ్ళ క్రిందట ఇదే నెలలో (ఏప్రిల్) విడుదలైంది. కాగా రేణుదేశాయ్ ప్రస్తుతం అకిరా నందన్ తో ఫారిన్ వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక ఆమె సినిమాలు విషయానికి వస్తే.. రవితేజ టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageshwara Rao) సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు