Renu Desai Enjoying Vacation in Kerala with Elephants Akira and Aadya with Mega Family Celebrations
Renu Desai : పండక్కి అంతా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటారని తెలిసిందే. ఇక సినిమా సెలబ్రిటీలు అయితే గ్రాండ్ గా వారి వారి కుటుంబాలతో సెలబ్రేట్ చేసుకుంటారు. అందులోను మెగా ఫ్యామిలీ గురించి చెప్పనవసరం లేదు. ప్రతి పండక్కి ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు. అలాంటిది సంక్రాంతి లాంటి పండక్కి మెగా ఫ్యామిలీ ఇంకెంత గ్రాండ్ గా చేసుకోవాలి మరి. అందుకే మెగా ఫ్యామిలీ(Mega Family) ఈ సంక్రాంతికి బెంగుళూరులో అందరూ కలిసి నాలుగు రోజుల పాటు సంక్రాంతి సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.
మొత్తం మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈ ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అయితే ఈ సంక్రాంతి వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనలేదు. బదులుగా పవన్ పిల్లలు అకిరా నందన్(Akira Nandan), ఆద్యలు వచ్చి సందడి చేశారు. దీంతో అకిరా, ఆద్య ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే సంక్రాంతికి ఈ ఇద్దరూ మెగా ఫ్యామిలీ దగ్గరకు వెళ్తే రేణు దేశాయ్ మాత్రం సింగిల్ గా పండగ చేసుకుంది.
Also Read : Sankranti 2025 : వచ్చే సంక్రాంతికి ఇప్పట్నుంచే పోటీ.. మళ్ళీ చిరు వర్సెస్ బాలయ్య?.. ఆ ముగ్గురు కూడా?
రేణు దేశాయ్ పిల్లల్ని మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ కి పంపించేసి తాను కేరళలోని వర్కాల సిటీకి వెళ్ళింది. అక్కడ ప్రకృతితో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. అక్కడ హోటల్ నుంచి ఓ ఫోటో షేర్ చేసి పిల్లల్ని మిస్ అవుతున్నాను అని పోస్ట్ చేసింది. అలాగే ఏనుగులకు స్నానం చేయిస్తున్న ఓ వీడియోని కూడా పోస్ట్ చేసింది. ఇక పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన రాజకీయాల్లో తను బిజీగా ఉన్నారు. దీంతో పవన్ అక్కడ ఏపీ రాజకీయాల్లో, రేణు దేశాయ్ కేరళలో వెకేషన్, పిల్లలు ఏమో మెగా ఫ్యామిలీతో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఒక్కొక్కరు ఒక్కో చోట అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.