Renu Desai : హాస్పిటల్ బిల్స్ పెరిగిపోతున్నాయి.. డబ్బులు లేవు.. ఆ దేవుడికి దండం పెట్టాను.. నెక్స్ట్ డే..

రేణు దేశాయ్ ఇటీవలే సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Renu Desai have no money for Running her NGO Shree Aadya Animal Shelter Pray for Money to God

Renu Desai : రేణు దేశాయ్ ఇటీవలే సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. యాడ్స్ కూడా చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అయితే రేణు దేశాయ్ ఇటీవల శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ అని జంతువుల కోసం ఒక ఎన్జీఓ ప్రారంభించింది. జంతువుల ఆరోగ్యం, ఎవరూ పట్టించుకోని జంతువులకు ఫుడ్ పెట్టడం లాంటివి చూసుకుంటుంది. ముఖ్యంగా వీధి కుక్కల కోసం పని చేస్తుంది రేణు దేశాయ్.

మొదట తన సొంత డబ్బులతో మొదలుపెట్టి ఇప్పుడు డొనేషన్స్ ఎవరైనా ఇస్తే తీసుకుంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తాను జంతువుల కోసం చేసే సేవా కార్యక్రమాలు పోస్ట్ చేస్తుంది. జంతువుల కోసం ఒక ఆంబులెన్స్ కూడా కొన్నారు. అయితే ఒకానొక దశలో తన దగ్గర ఎన్జీఓ కోసం పెట్టుకున్న డబ్బులు అన్ని అయిపోయాయని తెలిపింది.

Also Read : Ram Charan : కమెడియన్ సత్య కాళ్ళు మొక్కిన రామ్ చరణ్.. సత్య చరణ్ ఇంటికి వెళ్లడంతో.. వీడియో వైరల్..

రేణు దేశాయ్ మాట్లాడుతూ.. జంతువులకు హెల్త్ విషయంలో రోజూ వస్తూనే ఉన్నాయి. అంబులెన్స్, ఎన్జీఓ మెయింటైన్ తో రోజు రోజుకు హాస్పిటల్ బిల్స్ పెరిగిపోతున్నాయి. నా దగ్గర ఉన్న డబ్బులు అన్ని అయిపోవచ్చాయి. అనవసరంగా కంగారుపడి ముందే ఎన్జీఓ ప్రారంభించాను ఏమో అని అనుకున్నాను. దాంతో కాలభైరవ టెంపుల్ కి వెళ్ళాను. స్వామి.. నీ కుక్కల కోసం పని చేస్తున్నాను, నాకు ఏమి వద్దు, నా దగ్గర డబ్బులు లేవు, వాటి కోసం డబ్బులు వచ్చేలా చూడు అని మొక్కుకున్నాను. నెక్స్ట్ డేనే ఓ పెద్ద అమౌంట్ డొనేషన్ వచ్చింది. నేను ఆశ్చర్యపోయాను. దాంతో థ్యాంక్స్ చెప్తూ కాలభైరవ స్వామికి దండం పెట్టుకున్నాను ఎన్జీఓ కోసం అని తెలిపింది.

Also Read : Renu Desai : ఆ సినిమాని నాలుగు సార్లు చూసాను.. పడీ పడీ నవ్వాను.. రేణు దేశాయ్ కి కూడా ఆ సూపర్ హిట్ సినిమా ఇష్టం అంట..

ప్రస్తుతం తన శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ కి డొనేషన్స్ కోరుతూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతుంది. దీంతో పలువురు జంతు ప్రేమికులు రేణు దేశాయ్ కి సపోర్ట్ చేస్తున్నారు.