Renu Desai : రేణూ దేశాయ్ పోస్ట్ అతడిలో మార్పు తీసుకు వచ్చిందట.. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటో తెలుసా..?
రేణు దేశాయ్ చేసిన ఒక పోస్ట్ వల్ల ఒక నెటిజెన్ లో మార్పు వచ్చిందట. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటో తెలుసా..?

Renu Desai post on non veg eaters change netizen mindset
Renu Desai : ఒకప్పటి హీరోయిన్ మరియు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తమ పిల్లలు అకీరా, అధ్య ఫోటోలను కూడా షేర్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంటుంది. ఈ పోస్ట్ లతో పాటు మూగజీవులు గురించి కూడా పోస్టులు పెడుతుంటుంది. రేణు దేశాయ్ కి మూగజీవులు అంటే చాలా ఇష్టం. ఎంతంటే.. ఎక్కడో రోడ్డు మీద గాయంతో కనిపించిన మూగజీవిని ఇంటికి తీసుకు వచ్చి గాయం నయం చేసి దానిని తన బిడ్డలా చూసుకుంటుంది.
Kalyaan Dhev : కూతుర్ని మిస్ అవుతున్నా అంటూ చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్ పోస్ట్..
ఈ ప్రేమతోనే డెయిరీ ఇండస్ట్రీ పాల కోసం గేదె-ఆవులను ఎంతలా హింసిస్తారో, మీట్ ఇండస్ట్రీలో మేక-కోళ్లను ఎలా చంపేస్తుంటారో చూపిస్తూ కొన్ని వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఆ వీడియోలు చూడడానికి కూడా భయానకంగా ఉంటాయి. అలాంటి పోస్టులు ఎందుకు పెడుతుంటావు అని తన స్నేహితులు, నెటిజెన్లు ఆమెను ప్రశ్నిస్తుంటారు. ఆ ప్రశ్నలకు రేణు దేశాయ్ ఇప్పుడు జవాబు ఇచ్చింది. రీసెంట్ గా ఒక వ్యక్తి రేణు దేశాయ్ కి మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ లో ఏముందటే.. “మీరు షేర్ చేసే వీడియోలు చూసి నేను షాక్ అయ్యాను. అసలు చూడలేక పోయాను. అవి చూసిన దగ్గర నుంచి నాన్ వెజ్ తినడం మానేశాను. అంతేకాదు ఆ ఆలోచన కూడా రావడం లేదు” అంటూ పేర్కొన్నాడు.
ఈ మెసేజ్ చాట్ ని రేణు దేశాయ్ పోస్ట్ చేస్తూ.. “ఈ మార్పు కోసమే తాను అటువంటి పోస్టులు పెడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఒక 15 నిమిషాల నాలుక రుచి కోసం జంతువులను చంపేస్తున్నామా? అని ఆలోచించండి” అంటూ మూగజీవాల విషయంలో తన ఆవేదనని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
View this post on Instagram