Renu Desai thanks Ram Charan for his generosity
సినీ నటి రేణూ దేశాయ్‌కు మూగ జీవాలు అంటే ఎంతో ఇష్టం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటి సంక్షరణ కోసం ఓ ఎన్జీవోను ఆమె ప్రారంభించింది. దీనికి శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ అనే పేరు పెట్టింది. ఈ సంస్థ ఇప్పటికే తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ సంస్థకు ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చునని ఇప్పటికే రేణూ దేశాయ్ వెల్లడించింది.
ఈ సంస్థ కోసం ఓ అంబులెన్స్‌ను కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా రేణూ దేశాయ్ వెల్లడించింది. దీన్ని కొనుగోలు చేసేందుకు రామ్‌చరణ్ పెంపుడు శునకం రైమ్ విరాళాన్ని ఇచ్చినట్లుగా పేర్కొంది. ఈ క్రమంలో రైమ్‌తో పాటు రామ్‌చరణ్ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేసింది.
Miheeka Daggubati : బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న రానా భార్య.. వీడియో చూశారా..?
ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేస్తూ అంబులెన్స్ కొనుగోలు చేస్తున్న ఫోటోను పంచుకుంది. దీంతో రామ్‌చరణ్ దంపతుల మంచి మనసును పలువురు మెచ్చుకుంటున్నారు. రామ్‌చరణ్ దంపతులకు మూగ జీవాలు అంటే ఇష్టం అన్న సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే.. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
VenkyAnil3 : వెంకీ-అనిల్ రావిపూడి సినిమా నుంచి సూపర్ అప్‌డేట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?